తిరుపతి మంగళం: మంగళం పరిధిలోని తిరుపతి–కరకంబాడి ప్రధాన మార్గంలో బుధవారం యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక తిరుమల నగర్‌లో కాపురం ఉంటున్న శశి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏమి జరిగిందో కాని విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రోడ్డుపై పడిపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని తిరుపతి రుయాకు తరలించారు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


