డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల పరిస్థితి దారుణం
ఫస్ట్ ఇయర్ ముగిసినా
నిర్వహించనిసెకండ్ సెమ్ పరీక్ష
మే ఒకటి నుంచి జూన్ 15 వరకు
డిగ్రీ విద్యార్థులకు సెలవుల ప్రకటన
రెండో సంవత్సరం ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిన దుస్థితి
గత ఏడాది డిగ్రీ అడ్మిషన్ల ఆలస్యమే కారణమంటున్న అధ్యాపకులు
ఈ ఏడాదైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి జూన్‌లో డిగ్రీ అడ్మిషన్లు జరిపేనా!
అధికారులు మారినా.. సంస్కరణలు జరిగినా జిల్లాలో డిగ్రీ ప్రవేశాలు.. పరీక్షల నిర్వహణ తీరు మాత్రం మెరుగుపడలేదు. ఓ వైపు ప్రవేశాల్లో జరుగుతున్న విపరీతమైన జాప్యం.. మరో వైపు పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. షెడ్యూల్ మేరకు అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణలో అధికారులు సఫలీకృతం కాలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు పరేషాన్ అవుతున్నారు. ఉన్నత చదువులకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.
సంస్కృత జ్ఞానాన్ని ప్రపంచానికి చాటాలి
ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల
తిరుపతి సిటీ: ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏప్రిల్‌తో పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. అకడమిక్ ఇయర్‌లో అధికారులు ఏమి చేయలేని పరిస్థితిలో కేవలం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఉన్నత విద్యామండలి నిర్వాహకంతో జిల్లాలో వేలాది మంది విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో విద్యార్థులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
వచ్చే విద్యా సంవత్సరంలోనే సెకండ్ సెమ్ పరీక్ష
డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రతి ఏడాది జూన్ నెలలో చేపట్టి జూలై మొదటి వారానికి పూర్తి చేయాల్సి ఉంటుంది. సెమిస్టర్ విధానంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అక్టోబర్ లేదా నవంబర్ తొలి వారంలో పూర్తి చేసి,సెకండ్ సెమిస్టర్ ఏప్రిల్‌లో నిర్వహించాల్సి ఉంది. కానీ ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యంతో 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల కాగా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియకు జూలైలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్ని డిగ్రీ కళాశాలల్లో గత ఏడాది సెప్టెంబర్‌లో డిగ్రీ ప్రవేశాలు చేపట్టారు. దీంతో ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించారు. సెకండ్ సెమిస్టర్‌కు కనీసం ఆరునెలలు కాలవ్యవధి ఇస్తూ సిలబస్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ ప్రస్తావన ఎత్తకపోవడం గమనార్హం. దీంతో వచ్చే 2026–2027 విద్యా సంవత్సరం ప్రారంభంలో సెకండ్ సెమ్ పరీక్ష నిర్వహించనున్నారు.
తిరుపతి సిటీ: సంస్కృత జ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా అడుగులు పడాలని రష్యాలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దౌత్యకార్యాలయ ప్రతినిధి దేవ కౌశిక్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జాతీయ సంస్కృత వర్సిటీని సందర్శించి వర్సిటీ వీసీ, అధికారులు, అధ్యాపకులతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. జోతిష్యం, గణితంలోని పలు అంశాలను వెలికితీసి నూతన పాఠ్యాంశాలుగా రూపొందించి వాటిని ప్రపంచంలోని విశ్వవిద్యాలయాల్లో పలు కోర్సుల రూపంలో భాగస్వామ్యం చేస్తేనే సంస్కృతం మరింత ఉన్నత స్థితికి చేరుతుందని చెప్పారు. అనంతరం వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సాంకేతిక విష యాలపై పరిశోధన చేయాలన్నారు. డీన్లు ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, ప్రొఫెసర్ విష్ణుబట్టాచార్యులు, పీఆర్వో ప్రొఫెసర్ రమేష్‌బాబు, ఏపీఆర్వో డాక్టర్ కనపాల కుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం..
విద్యార్థులకు శాపం!
జిల్లా సమాచారం...
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 17
ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ రాయాల్సిన విద్యార్థులు 3,565
ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 104
ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ రాయాల్సిన వారు 6,950
టీటీడీ డిగ్రీ కళాశాలలు 5
ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ రాయాల్సిన విద్యార్థులు 2,892
గత ఏడాది ఇంటర్ ఫలితాలు విడుదలైన తేదీ 2025 ఏప్రిల్ 12
2025–26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టింది సెప్టెంబర్‌లో
ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు విడుదలైన తేదీ ఏప్రిల్ 15
డిగ్రీ అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న
విద్యార్థులు సుమారు 24 వేల మంది
ఈ ఏడాదైనా యంత్రాంగం మేలుకొనేనా?
ప్రతి ఏడాది ఆన్‌లైన్ అడ్మిషన్ల మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎమ్‌డీసీ) వెబ్‌సైట్ ద్వారా ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలకు మేలో నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్ 15న నాటికి ప్రవేశాలు పూర్తి స్థాయిలో చేపట్టాల్సి ఉంది. కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 శాతం కూడా అడ్మిషన్లు జరగడం లేదు. మరికొన్ని కోర్సుల్లో సింగిల్ డిజిట్‌కే ప్రవేశాలు పరిమిత మవుతున్నాయంటే అధికారులు నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదైనా ఉన్నత విద్యామండలి మేల్కొని, ఇంటర్ ఫలితాలు ఈనెల 15వ తేదీన విడుదల కాగా డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ త్వరగా విడుదల చేసి, జూన్‌లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం సుస్పష్టం
డిగ్రీ కళాశాలలకు మే ఒకటో తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. సెకండ్ సెమిస్టర్ పరీక్ష నిర్వహించడంలో విఫలమైన ప్రభుత్వ యంత్రాంగంపై ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు మండిపడుతున్నారు. ఉన్నత విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, డిగ్రీ అడ్మిషన్లు సకాలంలో చేపట్టకుండా విద్యార్థులపై భారం మోపుతోందని వాపోతున్నారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో పరీక్షలు రాయకుండానే ఫస్ట్ ఇయర్ పూరైన దాఖలాలు గతంలో ఎన్నడూ చూడలేదని, విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


