చంద్రబాబు పాలనలో రైతులు, ప్రజలకు తప్పని కష్టాలు
పెట్రోల్, డీజిల్ కోసం గంటల కొద్ది క్యూలో అవస్థలు
ప్రజాసమస్యలు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
ఎద్దుల బండిపై ఆటో ఎక్కించుకుని భూమన అభినయ్ నిరసన
కొనసాగుతున్న చమురు కష్టాలు
● తిరుపతిలో తెరవని పలు పెట్రోల్ బంకులు ● నాయుడుపేట, శ్రీకాళహస్తిలో డీజిల్ కొరత ● వెంకటగిరిలో రేషన్ పద్ధతిలో పెట్రోల్, డీజిల్ ● వాహనచోదకులకు తప్పని తిప్పలు
●
డీజిల్ లేక ఇబ్బందులు
డీజిల్ దొరక్క నాయుడు పేట ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయ పనులు చేయాలంటే ట్రాక్టర్ అవసరం. ట్రాక్టర్ పనిచేయడానికి డీజిల్ కావాలి. అయితే డీజిల్ లేకపోవడంతో తిప్పులు పడుతున్నాం. ఈ ఖరీఫ్‌లో పొలం దుక్కి చేయడానికి డీజిల్ లేక తిప్పులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి ఇంధన సమస్యలు లేకుండా చూడాల్సి ఉంది. – మారం రెడ్డి ముత్యాలరెడ్డి,
సన్నకారు రైతు, నాయుడుపేట
ఇంధన సంక్షోభం
ఇంధనం సంక్షోభంతో అవ స్థ తప్పడం లేదు. ఇంధన అగచాట్లు అన్నీఇన్నీకావు. ప్రతి కుటుంబానికి వాహ నం ఉంది. ప్రతి పనికీ ద్విచక్రవాహనం లేదా కారు ఉంటే ప్రయాణం సాగుతుంది. అయితే పెట్రోల్ లేదు డీజిల్ లేదంటే ఎలా? ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే తీవ్రమైన వ్యతిరేకత తప్పదు.
– మణికంఠ, శ్రీకాళహస్తి
రేషన్ పద్ధతిలో ఇంధనం
సార్ ఎక్కువ పెట్రోల్ పట్టలేం. కారుకు అయితే 10 లీటర్లు, స్కూటర్‌కు అయి తే రూ.200 పట్టుకోండి అని రేషన్ పద్ధతిలో పట్టడం విడ్డూరంగా ఉంది. ఔరా ఎంత మార్పు అంటూ అంతా చర్చించుకుంటున్నాం. గతంలో పెట్రోల్ బంకుల్లో సిబ్బంది వినియోగదారుల కోసం వేచి చూసే వారు. నేడు వారి ప్రవర్తనలోనూ మార్పువచ్చింది. ఇంతే పట్టుకుంటే పట్టుకో.. లేదంటే లేదు అంటున్నారు. –వేణుగోపాల్‌రెడ్డి, వెంకటగిరి
డీజిల్ లేక ఆటో ఆగింది
బంకులు ఉండి కూడా ఎక్క డ డీజిల్ లేకపోవడంతో లీటర్ డీజిల్ దొరక్కపోవడంతో ఆటోను ఆపుకోవా ల్సి వచ్చింది. నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర పట్టణాలకు ప్రయాణికులతో ఆటోను తిప్పితినే పూట గడుస్తుంది. అలాంటిది ఇంటి వద్దే ఆటో ఉంచుకుంటే బతుకెలా సాగుతుంది. – ఏ వెంకీ,
ఆటోవాలా, ఏకొల్లు, దొరవారిసత్రం మండలం
తిరుపతి అర్బన్: జిల్లాలో ఇంధన కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అరకొరగా అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని వాహనచోదకులు మండిపడుతున్నారు. అయితే సోమవా రంతో పోల్చుకుంటే మంగళవారం కాస్తా మెరుగ్గా ఉన్నప్పటికీ రేషన్ పద్ధతిలో పెట్రోల్, డీజిల్ నింపుతున్నారు. పలుచోట్ల ఇప్పటికీ క్యాన్లు, బ్యారళ్లకు ఇంధనం పట్టడానికి పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆసక్తి చూపడం లేదు. ఇరాన్– అమెరికా యుద్ధంతో ఇంధన కష్టాలు చోటుచేసుకున్నాయా? లేదా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరో వారం పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెంచడంలో భాగంగానే ఇలా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు నెలకొన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
పట్టణాల్లో అరకొర పెట్రోల్..
పల్లెలో డీజిల్ సమస్యలు
జిల్లాలోని పట్టణాల్లో పెట్రోల్ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్ సమస్యలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 185 పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ పలు పెట్రోల్ బంకులు అలంకారప్రాయంగానే ఉన్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద దారాలు కట్టి..నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఈ క్ర మంలో పలువురు ఆటోవాలాలు రవాణా చార్జీలను అధికంగా చేస్తున్నారు. దీంతో ప్రజలు ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. వెంకటగిరిలో పూర్తి గా రేషన్ పద్ధతిలో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు. స్కూటర్‌కు రూ.200, కారుకు 10 లీటర్లు, లారీకి 20 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. నాయుడుపేట, శ్రీకాళహస్తిలో డీజిల్ దొరకడం లేదు. పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేదు.. పెట్రోల్ అయితే ఉందని చెబుతున్నారు. కొందరు క్యాన్లకు పట్టడం లేదు.
పెట్రోల్
లేకపోవడంతో తోసుకుపోతున్న
ద్విచక్ర వాహన చోదకులు
తిరుపతి మంగళం : దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఇంధన కొరత ఒక రాష్ట్రంలోనే ఉందంటే అది కేవలం సీఎం చంద్రబాబు చేతగాని తనమైనా ఉండాలి, లేక ప్రజాసమస్యలంటే లెక్కలేని తనమైనా ఉండాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి నేతలు తమ జేబులు నింపుకోవడానికే పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారని ఆయన మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ కొరతపై తిరుపతిలో ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి, తీసుకెళ్లి భూమన అభినయ్ పార్టీ శ్రేణులతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో రైతులు, ప్రజలకు తీవ్ర కష్టాలే మిగిలాయన్నారు. రైతులు పంటలు పండించుకోవాలంటే యూరియా కష్టాలు.. పండిన పంటలు అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధరల కష్టాలు.. రేషన్ బియ్యం తీసుకోవాలంటే కూలి పనులు సైతం ఆపుకుని క్యూలో నిలబడాల్సి కష్టాలు..ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కోసం గంటల కొద్ది మండుటెండలో క్యూలో నిలబడాల్సి ఇబ్బందులు.. అటు రైతులు, ఇటు ప్రజలకు తప్పడంలేదని మండిపడ్డారు. రూ.వంద పెట్రోల్ కోసం గంటల కొద్ది క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఎర్రగుంటపాళెంలో పెట్రోల్ కోసం వచ్చిన ఒక యువకుడిని పోలీస్ సీఐ చితకబాదిన సంఘటన కూడా చూస్తున్నామన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం, చేతగాని తనం వల్లే రాష్ట్రంలో ఇంధనం కొరత ఉందన్నారు. పెట్రోలో బంకుల యజమానులతో చంద్రబాబు లాలూచి పడి ప్రభుత్వమే ఇంధన కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో పొట్టకూటి కోసం పరుగులు పెట్టే ఉద్యోగులు, వ్యాపారులు, ట్యాక్సీ, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలను పక్కన పెట్టి కొంతమంది మంత్రులు సింగపూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలపై ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికై నా పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని, లేకుంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తమ్ముడు గణేష్, ఉమా అజయ్, పుణీత, పార్టీ శ్రేణులు వాసుయాదవ్, షేక్ ఇమ్రాన్ బాషా, గీతాయాదవ్, ఉదయ్‌వంశీ, మల్లం రవికుమార్‌రెడ్డి, దినేష్‌రాయల్, పసుపులేటి సురేష్‌రాయల్, అనీల్‌రెడ్డి, రమణారెడ్డి, మద్దాలి శేఖర్, వెంకటేష్‌రాయల్, కుప్పయ్య, మురళీ, మధుబాల, సాయికుమారి, మునీశ్వరి, పునీత, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించుకుని
వినూత్న నిరసన తెలుపుతున్న భూమన అభినయ్‌రెడ్డి
ఇంధనం ధరలు పెంచుతున్నారని చర్చ?
ఇంధనం ధరలు త్వరలోనే పెంచేస్తారని పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. టీ దుకాణాలు, చికెన్ షాపులు, కూడళ్లు ఇలా పది మంది కలిసిన చోట అంతా ఇంధనం కష్టాలపై మాట్లాడుకుంటున్నారు. త్వరలో పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయని చర్చించుకుంటున్నారు.


