పెట్రోల్‌ బంకుల్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు

Apr 29 2026 8:24 AM | Updated on Apr 29 2026 8:24 AM

తిరుపతి రూరల్‌: నగర శివార్లలోని పెట్రోల్‌ బంకులను తిరుపతి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవిలాల సమీపంలోని ఇండియన్‌ ఆయి ల్‌ కార్పొరేషన్‌, విద్యానగర్‌ వద్దనున్న భారత్‌ పెట్రోలియం, కూరపాటి ఫిల్లింగ్‌ స్టేషన్‌, చెర్లోపల్లి వద్ద ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తిరుపతి రూరల్‌ తహసీల్దార్‌ జనార్దన్‌రాజు పాల్గొన్నారు.

అధికారుల పర్యవేక్షణలో బంకులు

సూళ్లూరుపేట:నియోజకవర్గంలోని ఆయా మండలాల తహపీల్దార్లు ఎప్పకప్పుడు స్టాక్‌ రిపోర్ట్‌ తెప్పించుకుంటూ బంకులను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తహసీల్దార్లు పెట్రోల్‌ బంకులపై నిఘాకు వీఆర్వోలను ఏర్పాటు చేశారు. రేషన్‌ పద్ధతిలో మాత్రమే ఆయిల్‌ ఇస్తున్నారు. మంగళవారం తహసీల్దార్‌ శైలకుమారి అన్ని బంకులను తనిఖీలు చేశారు.

ఆటోవాలాల నిరసన

తిరుపతి కల్చరల్‌:పెట్రోల్‌, డీజిల్‌ కొరతను తక్షణ మే నివారించాలని, అక్రమ నిల్వలు ఉన్న పెట్రోల్‌ బంకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వినూత్నంగా ఆటోకు తాళ్లు కట్టుకుని లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎస్‌. జయచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రమణ్యం, సీఐటీయూ నాయకులు పరుశురాం, యుగంధర్‌, జిల్లా ఆటో యూనియన్‌ కార్యదర్శి వాసు, నాయకులు రాము, ప్రసాద్‌, బాదుల్లా కేశవులు ప్రైవేట్‌ బస్సు యూనియన్‌ కార్యదర్శి శేషయ్య వరదారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement