బంకుల మూతపై వైఎస్సార్‌ సీపీ ధ్వజం | - | Sakshi
Sakshi News home page

బంకుల మూతపై వైఎస్సార్‌ సీపీ ధ్వజం

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పెట్రోల్‌ బంక్‌ల మూత ● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు ● పొరుగు రాష్ట్రంలోని పెట్రోల్‌ బంకుల వద్ద జిల్లా వినియోగదారులు ● పెట్రోల్‌, డీజిల్‌ కష్టాలపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌ – 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

వైభవంగా బ్రహ్మోత్సవాలు
పెంచలకోనలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఎరువుల దుకాణాలు బంద్‌
తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఎరువుల దుకాణాల యజమానులు సోమవారం ఒక రోజు బంద్‌ నిర్వహించారు.

తమిళనాడు, కర్ణాటకలో ఫుల్‌గా పెట్రోల్‌, డీజిల్‌

మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ఉమ్మడి చిత్తూరు జిల్లాను ఇంధన కొరత వేధిస్తోంది. మూడు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు నిండుకోవడంతో వాహనచోదకులు, యజమానులు ఇక్కట్లు పడుతున్నా రు. జిల్లాలో పలు పెట్రోల్‌ బంకుల వద్ద నోస్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. అరకొర గా ఉన్న బంకుల వద్ద ఆయిల్‌ కోసం బారు లు తీరుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. తీరా పంపు వద్దకు చేరుకునే సరికి వారు అడిగినంత పెట్రోల్‌ లేదా డీజిల్‌ పట్టకపోవడంతో జనం నిరాశ చెందుతున్నారు.

కపిలితీర్థం రోడ్డులోని వరదరాజ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఐఓసీ బంక్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కోసం సోమవారం బారులు తీరిన వాహనాలు

డీజిల్‌ లేదని ఆటోలు పోలే..

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: డీజిల్‌ లేదని ముసిలిపేడుకు ఆటోలు పోలే. అందుకే బస్టాండుకు వ చ్చాను. ఎపుడు ఈ మాదిరిగా లేదు. వచ్చే దారిలో చూస్తూ వచ్చినాను. ఆటోవాళ్లంతా వరుసగా పెట్రోల్‌ బంకుల వద్ద నిలబెట్టినారు. వాళ్ల కోసం కూచుంటే కాదని బస్సు ఎక్కేందుకు వచ్చినాను.

– నాగరాజు, ప్రయాణికుడు, మునగళపాళెం

తిరుమలకు బస్సెక్కాల్సిందే..

తప్పదు మరి తిరుమల శ్రీవారి దర్శనం కోసం బస్సు ఎక్కాల్సిందే. జీపుల్లో వెళ్లతామని అనుకున్నాం. డీజిల్‌ కొరత కారణంగా అవి కాస్తా పె ట్రోల్‌ బంకుల వద్దకు వెళ్లి క్యూలైన్‌లో ఉన్నాయి. ఎప్పడికి క్యూలైన్‌ పూర్తవతుందో తెలియని పరిస్థితి. జీపుల కోసం వేచి ఉండాలంటే జరగని పని. అందుకే అలిపిరి బాలాజీ బస్టాండ్‌కు చేరాం. – ఓ. నారాయణ, శ్రీవారి భక్తుడు,

సదుం మండల కేంద్రం

ఈ పరిస్థితి ఎప్పుడు చూడలేదు

నేను తిరుపతిలోనే ఆటో నడుపుతాను. ఎప్పుడు డీజిల్‌ కోసం ఇబ్బందులు పడిందిలేదు. మూడు రోజులుగా కొరత ఏర్పడింది. నా ఆటోలో రాత్రి 10 గంటలకు ఆటోలో డీజిల్‌ అయిపోయింది. అన్ని బంకులు తిరిగాను. అయితే కేటీ రోడ్డులోని పెట్రోల్‌ బంకు వద్ద డీజిల్‌ పడుతున్నారని తెలుసుకుని ఆటోను తోసుకుని ఉదయం 10 గంటల నుంచి క్యూలైన్‌లో ఉన్నాను. ఇపుడు మధ్యాహ్నం 1.30 అవుతోంది. ఇంకా ఎంత సమయం పడుతోందని ఎదురు చూస్తున్నా.

– వెంకటేశ్వర్లు, ఆటో నిర్వాహకుడు, తిరుపతి

నారు ఎండిపోతోంది..

ఖరీఫ్‌ సీజన్‌లో వరినాట్లు వేయాలి. నార్లు పోసుకుని ఉన్నా. నాట్లు వేయాలంటే పొలం దు క్కి చేయాలి. దుక్కి చే యాలంటే రోటావేటర్‌కు డీజిల్‌ అవసరం. డీజిల్‌ లేక రోటావేటర్‌ను పక్కన పెట్టేసి ఎదురు చూస్తున్నా. రెండు రోజుల్లో నాట్లు వేయకపోతే నారు ఎండిపోతుంది. ఉన్నట్టుండి డీజిల్‌ ఇంత ఇబ్బంది వస్తుందనుకోలేదు. లేదంటే ముందుగా అయినా తెచ్చుకుని ఉండేవాళ్లం. ఉన్నట్టుండి ఇబ్బంది రావడంతో రైతుగా నాకు నష్టమే మరి..

– దిరసాల మురళి, వద్దిగుంట కండ్రిగ,

నాయుడుపేట మండలం

డిమాండ్‌కు తగ్గట్టుగా

స్టాక్‌ తెప్పించుకోండి

తిరుపతి అర్బన్‌: వినియోగదారుల డిమాండ్‌కు తగ్గట్టుగా ఇంధనం స్టాక్‌ తెప్పించుకోవాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ ఆదేశించారు. సోమ వారం ఆయన కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయు డు, జేసీ గోవిందరావుతో కలసి ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ నయరా పెట్రోల్‌ బంకుల సేల్స్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెట్రోల్‌ బంకుల వద్ద స్టాక్‌ లేదంటూ బోర్డులు పెట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దని స్పష్టం చేశారు.ఆయిల్‌ కార్పొరేషన్లతో సమన్వయం చేసుకుంటూ గతంలో ఎలా అవసరం అయిన మేరకు ఇంధనం తెప్పించుకునేవారో.. అలానే ట్యాంకర్లను తెప్పించుకోవాలని సూచించారు. సివిల్‌ సప్లయి జిల్లా అధికారి శేషాచలం రాజు తదితరులు పాల్గొన్నారు.

వదంతులు నమ్మవద్దు

తిరుపతి క్రైం: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా పోలీస్‌ శాఖ విజ్ఞప్తి చేసింది. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం తిరుపతి పరిధిలోని మొత్తం 189 పెట్రోల్‌ బంకుల్లో కేవలం 26 బంకులు మాత్రమే తాత్కాలికంగా డ్రై అవుట్‌ అయినట్లు తెలిపారు. అయితే, ఆ బంకులకు కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఇంధనం సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఈ సాయంత్రానికి జిల్లాలోని అన్ని పెట్రోల్‌ బంకులు పూర్తిస్థాయి లో కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు. అవసరానికి మించి పెట్రోల్‌, డీజిల్‌ నిల్వ చేసుకోవడంతో కృత్రిమ కొరత ఏర్పడుతోందని, దాంతో కొన్ని ప్రాంతాల్లో క్యూలైన్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమ అవసరానికి తగినంత మాత్రమే ఇంధనం తీసుకోవాలని సూచించారు. అలాగే, సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎప్పీ తెలిపారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,878 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్‌ టికె ట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. వాహనచోదకులకు పెట్రోల్‌, డీజిల్‌ దొరక్క వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇంటింటా పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో ఇక్కట్లు పడుతున్నారు. తిరుపతి జిల్లాలో 185 పె ట్రోల్‌ బంకులున్నాయి. అనధికారిక లెక్కల ప్రకా రం సోమవారం సగానికిపైగా మూతపడ్డాయి. అధికారులు మాత్రం కేవలం 25 పెట్రోల్‌ బంకులు మాత్రమే మూతపడ్డాయని చెప్పుకొచ్చారు. ఆదివారం 15 పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఎక్కువే. అధికశాతం బంకులు మూతపడడంతో ఉన్న బంకుల వద్ద వినియోగ దారులు బారులు తీరారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని బంకుల్లో అధికధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవడం కనిపించింది. తిరుపతికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి రూ.200 ఇస్తే..బంకులోని వ్యక్తి లీటర్‌ పెట్రోల్‌ పట్టి రూ.30 తిరిగి చేతికి ఇచ్చాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ‘అంతే వెళ్లు’ అంటూ సమాధానం ఇచ్చాడని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పలు పెట్రోల్‌ బంకుల వద్ద కనిపించింది.

చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి

చిత్తూరు జిల్లాలో చమురు కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ తిరుపతి జిల్లా పరిస్థితే నెలకొంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 146 పెట్రోల్‌ బంక్‌లున్నాయి. ఇప్పటి వరకు సుమారు 30 పెట్రోల్‌ బంక్‌ల వరకు మూతబడ్డాయి. ప్రధానంగా పలు బంక్‌ల్లో డీజిల్‌ కొరత కనిపిస్తోంది. మరికొన్ని బంక్‌ల్లో డీజిల్‌ ఉన్న రూ.200కు మించి పట్టడంలేదు. దీంతో వాహనచోదకులు అల్లాడిపోతున్నారు. ఇక పలు బంక్‌ల్లో వాహనాలు కిక్కిరిస్తున్నాయి. డీజిల్‌ కోసం వాహన యజమానులు పడిగావులు కాస్తున్నారు. సరఫరాలో లోటు కనిపిస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ కోసం గంటల కొద్ది నిరీక్షిస్తున్నారు.

ఆగిన ఆటోలు

పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లి, వచ్చే ఆటోలు పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా రోడ్డు పైకి ఎక్కడం లేదు. ఆటోలు రాకపోవడంతో అనేక మంది పల్లె ప్రాంత వాసులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. ఫలితంగా సోమవారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు జనంతో కిక్కిరిసిపోయాయి. అత్యవసరం అనుకున్న వారు ఆటో, టాక్సీలను ఆశ్రయించారు. వారు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అద్దె ధరలు అమాంతం పెంచి అడుగుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ దొరకడం లేదని, తామూ బ్లాక్‌లో కొనుగోలు చేసుకున్నామని సమాధానం చెబుతున్నారు.

చిరువ్యాపారులకు తిప్పలు

ఆటోలు పల్లె ప్రాంతాల వైపు రాకపోవడంతో అనేక మంది చిరు వ్యాపారులు, కూరగాయలు తీసుకొచ్చేవారు, పెద్ద మార్కెట్‌కు వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లే వారు సైతం తిరుపతి రావడం మానేశారు. స్థానికంగానే కూరగాయలను గ్రామాల్లో తిరిగి తక్కువ ధరకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రయాణం రద్దు చేసుకున్నా

ఏర్పేడు: మా బంధువుల పిల్లలకు పుట్టెంట్రుకలు తీసే శుభకార్యానికి సోమవారం ఇంటి సొంత ఆటోలో భార్యతో కలసి బయల్దేరాను. దుర్గిపేరి పెట్రోల్‌ బంకు వద్ద నోస్టాక్‌ బోర్డు కనిపించింది. అక్కడ నుంచి ఏర్పేడు వైపు బయల్దేరి ఐఐటీ సమీపంలో ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకు వద్ద ఆటోకు డీజిల్‌ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడా లేదు. దీంతో ఆలోచనలో పడ్డాను. ట్యాంకులో ఉన్న కొంత డీజిల్‌తో అంత దూరం వెళ్లి రావటం అసాధ్యమని భావించి మా ప్రయాణం రద్దు చేసుకున్నాను. – సుబ్రమణ్యం, పల్లంపేట, ఏర్పేడు మండలం

మూడు రోజులుగా ఇంటికే పరిమితం

తిరుపతి తుడా: రోజూ ఆటో నడిపితేనే కుటుంబం జీవనం సాగుతుంది. కానీ మూడు రోజులుగా డీజిల్‌ కొరతతో ఆటో ఇంటికే పరిమితమైంది. పెట్రోల్‌ బంకుల వద్ద కిలోమీటర్‌ మేర క్యూలైన్‌ ఉంది. క్యూలైన్‌లో 5 గంటల పాటు వేచి ఉన్నా కేవలం ఒక వెహికల్‌కు రూ.100 మాత్రమే డీజిల్‌ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఆటో ఈఎమ్‌ఐ కట్టాలి, ఇంటికి నిత్యావసరాలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. – రాము, ఆటో డ్రైవర్‌, తిరుపతి

డీజిల్‌ దొరక్క ఇంటి వద్దే ఉంచా

రైల్వేకోడూరు అర్బన్‌ : నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. డీజిల్‌ దొరక్క ఆటో ఇంటివద్దే ఉంచుకున్నా. ఒక వేళ ఉన్నా పెట్రోల్‌ బంక్‌ల వద్ద గంటల తరబడి ఉండాల్సివస్తోంది. అందువల్ల ఆటోను నడపకుండా ఉన్నాను. ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేకుండా చూడాలి.

– సుబ్రమణ్యం, రాఘవరాజపురం అరుంధతివాడ

సరిహద్దు పెట్రోల్‌ బంకుల్లో కొనుగోలు

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ దొరక్కపోవడంతో స్థానికులు అనేక మంది సరిహద్దులోని తమిళనాడులో ఉన్న పళ్లిపట్టు, తిరుత్తణి, ఊత్తుకోట, ఆరంబాకం పెట్రోల్‌ బంక్‌లకు చేరుకుని, వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించుకుని తిరిగి రావడం కనిపించింది. ముందు జాగ్రత్తగా వాటర్‌ బాటిళ్లు, క్యాన్లలో కూడా పెట్రోల్‌, డీజిల్‌ నింపుకుని తిరిగి జిల్లాకు చేరుకుంటున్నారు. అధికారులు సైతం కొందరు తమిళనాడు పరిధిలోని పెట్రోల్‌ బంకులకు వెళ్లి కొనుగోలు చేయడం కనిపించింది.

అన్నదాతలకు అవస్థలు

వ్యవసాయ పనులకు ట్రాక్టర్లను వినియోగించే రైతులకు పెట్రోల్‌, డీజిల్‌ కష్టాలు తప్పలేదు. రేణిగుంట మండలం వెంకటాపురంలో ఓ రైతు వరి నాట్లు వేసేందుకు ట్రాక్టర్‌తో దుక్కి సిద్ధం చేసేపనిలో నిమగ్నమయ్యారు. దుక్కి దున్నతుండగా డీజిల్‌ లేక మధ్యలోనే ట్రాక్టర్‌ ఆగిపోయింది. చేసేది లేక పొలంలోనే ట్రాక్టర్‌ని విడిచి డీజిల్‌ కోసం బంకుల చట్టూ తిరిగారు. డీజిల్‌ కొరత కారణంగా సొమవారం పనులు ముందుకు సాగలేదు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేద్యం కోసం వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్‌ కొరత కారణంగా ఎక్కడివక్కడే ఆగిపోయాయి.

పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా తిరుపతిలో అనేక బంకులు మూతపడ్డాయి. వినియోగ దారుల ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు నియోజక వర్గ సమన్వయకర్తలు భూమన అభినయరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోటి రాజేష్‌, విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి నగరంలో పలు పెట్రోల్‌ బంకులను పరిశీలించి వినియోగ దారుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడిందని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement