ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

తిరుపతి సిటీ: వచ్చేనెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీ క్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువు సోమవారంతో ముగిసింది. కానీ విద్యార్థుల అభ్యర్థన మేర కు ఈనెల 30వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ అవకాశం కల్పించిందని ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించండి

– పీజీఆర్‌ఎస్‌కు 303 అర్జీలు

తిరుపతి అర్బన్‌: ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. తాగునీటి వసతులతోపాటు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ, మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు రోజ్‌మాండ్‌, అనురాధ, డిప్యూటీ కలెక్టర్‌ గీతాంజలి అర్జీదారుల నుంచి 303 అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై 177, సెర్ఫ్‌కు 12, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 11, పంచాయతీరాజ్‌కు 21 అర్జీలు వచ్చాయని అధికారు లు తెలిపారు. అధికారులు అందుకున్న అర్జీలను ఆయా విభాగాలకు చెందిన జిల్లా అధికారులకు పంపించారు. గడువులోపు పరిష్కారం చూపాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement