మా బడిని మా ఊర్లోనే ఉంచండి | - | Sakshi
Sakshi News home page

మా బడిని మా ఊర్లోనే ఉంచండి

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

తిరుపతి అర్బన్‌: మా బడిని మాఊర్లోనే ఉంచాలని గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఏర్పేడు మండలంలోని పాగాలిలో ఉన్న పాఠశాలను పంగూరు గ్రామానికి తరలించడంతో వచ్చే ఇబ్బందుల నేపథ్యంలో ఆందోళన చేపట్టారు. మూడు కిలోమీటర్ల మేరకు విద్యార్థులు పాగాలి నుంచి పంగూరు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. వారికి మద్దతుగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, సీపీఎం నేత సుమన్‌శేఖర్‌, రంగయ్య, ప్రగతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శిరీషా ఆందోళనలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement