పన్నులు చెల్లించకుంటే వాహనాల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

పన్నులు చెల్లించకుంటే వాహనాల సీజ్‌

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

తిరుపతి మంగళం: జిల్లాలోని మోటారు క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, బస్సులు, లారీలు, ట్రాక్టర్‌–ట్రైలర్లు టిప్పర్‌ వంటి వాహనాలకు సంబంధించిన త్రైమాసిక పన్ను సకాలంలో చెల్లించకుంటే వాహనాలు సీజ్‌ చేస్తామని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వారు పెనాల్టీ లేకుండా ఈ నెల 31వ తేదీ లోపు చెల్లించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. గడువులోపు పన్నులు చెల్లించాలని కోరారు. పన్ను సకాలంలో చెల్లించలేకుండా వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే మే నుంచి 100 శాతం పెనాల్టీ, జూన్‌ మాసంలో 200 శాతం పెనాల్టీ విధిస్తా మని ఆయన హెచ్చరించారు. అలాగే గతంలో రవాణా శాఖ అధికారులు వాహ నాలపై నమోదు చేసిన తనిఖీ రసీదులకు సంబంధించిన అపరాధ రుసుము లు, పన్ను బకాయిలు ఉంటే, వాటిని కూడా తక్షణమే చెల్లించాలని సూచించారు. గడువు తేదీ అనంతరం పన్నులు చెల్లించని వాహనాలపై,మోటారు వాహన చట్టం ప్రకారం, కఠిన చర్య లు తీసుకుని, అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రతి వాహన యజమాని తన వాహనానికి సంబంధించిన ఫిట్నెస్‌ సర్టిఫికేట్‌, ఇన్సూరెన్‌న్స్‌, పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌, పన్ను తదితర అన్ని పత్రాలతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను వాహనం నడిపే డ్రైవర్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement