జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సుధాకర్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సుధాకర్‌

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

రేణిగుంట: ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా విశ్రాంత పీడీ డా.సుధాకర్‌, సభ్యుడిగా మునిరత్నం బాబు నియమితులయ్యా రు. వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించి జిల్లాలో ఫుట్‌బాల్‌ క్రీడకు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు. జూన్‌ 5, 6, 7 తేదీల్లో రేణిగుంట రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ మైదానంలో భారీ స్థాయిలో ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వారిని అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement