పరిణయోత్సవం..పరిసమాప్తం | - | Sakshi
Sakshi News home page

పరిణయోత్సవం..పరిసమాప్తం

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

తిరుమల: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. అనంతరం రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు సుప్రసిద్ధ కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనంతరం స్వామి దేవేరులతో కలిసి విహరిస్తూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యకమంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈఓ రవిచంద్ర, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు.

పద్మావతీ పరిణయోత్సవం

నిర్వహిస్తున్న వేదపండితులు

Advertisement
 
Advertisement
Advertisement