రైల్వేకోడూరు అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల అవసరాలను గాలికొదిలేసి, అమరావతి పేరుతో రియల్‌ఎస్టేట్ చేయడం వల్ల ప్రజల ఇంట్లో గ్యాస్‌లేదు బయట డీజిల్ లేదని సోమవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల ముందు చూపులేకపోవడంతోనే కేవలం ఏపీలో మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతో ఆలోచించి సమస్యలు లేకుండా జాగ్రత్తగా పాలన సాగిస్తున్నారని గుర్తుచేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని సమస్య మన రాష్ట్రంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అమరావతిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రజలు తిప్పలు పడుతుంటే మంత్రులు సింగపూర్‌లో చక్కర్లు కొడుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా, అభివృద్ధి చేయకపోయినా మొత్తం మీద అప్పుల్లో రికార్డు సృష్టించారని తెలిపారు.
సంప్రదాయాలపైనా కక్ష
గ్రామాలలో జాతర సంప్రదాయాలకు, నమ్మకం, విశ్వాసాలకు నిదర్శనమని అలాంటిది చిట్వేలి జాతరకు ఉత్తర్వులు ఇవ్వకుండా రద్దు చేసి సంప్రదాయాలపైనా కక్ష సాధిస్తున్నారని కొరముట్ల ఆరోపించారు. దశాబ్దం చరిత్ర కలిగిన జాతరను నిలిపి వేయడం సంప్రదాయాలు, విశ్వాసాలను తొక్కి పెట్టడమేనని విమర్శించారు. జాతర జరగక పోవడం అరిష్టమని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెవుశ్రీనివాసులురెడ్డి, వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, సీహెచ్ రమేష్, నందాబాల, గని, రాజారెడ్డి, సిద్దయ్య పాల్గొన్నారు.


