ఒక్కటే కిడ్నీ ఉంది సార్‌.. పింఛన్‌ ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

ఒక్కటే కిడ్నీ ఉంది సార్‌.. పింఛన్‌ ఇవ్వండి

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

నాపేరు సోనియా. నా భర్త పేరు అన్నమలై. మాది సత్యవేడు మండలంలోని సిరసినంబేడు గ్రామం. అయితే మా కుమార్తె గాయిత్రి నాలు గో తరగతి చదువుకుంటోంది. ఇటీవల చిన్నపాటి అనారోగ్య సమస్య రావడంతో ఆస్పత్రిలో చూపించాం. అయితే డాక్టర్లు మా కుమార్తెకు ఒక్కటే కిడ్నీ ఉందని చెప్పారు. పుట్టుకతోనే ఇలా ఉందని వెల్లడించారు. దీంతో ఆందోళన మొదలైంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నా కుమార్తెకు పింఛన్‌ ఇవ్వాలని కోరుతున్నాం. కలెక్టరేట్‌లో అర్జీ కూడా ఇచ్చాం. అయితే అనుమతులు రాలేదని చెబుతున్నారు.

– కుమార్తె గాయత్రితో తల్లి సోనియా, సత్యవేడు

పింఛన్‌కు అనుమతులు వచ్చాయా?

నా పేరు ఇ.సుబ్బమ్మ. మాది కేవీబీపురం మండలంలోని ఎస్‌ఎల్‌పురం ఎస్టీకాలనీ, మా కుమారుడు పేరు ఇ.బాలాజీ. అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన గాయాల నేపథ్యంలో నా కుమారుడు బాలాజీకి ఓ కాలు తీసివేశారు. దీంతో పింఛన్‌ కోసం తిరుగుతున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూస్తున్నాం. దివ్యాంగుడిగా మారిన తమ కుమారుడుకి వైద్యఖర్చులు సైతం పెట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేదు. మాకు పింఛన్‌ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాం.

– కుమారుడు ఇ.బాలాజీతో తల్లి ఇ.సుబ్బమ్మ

Advertisement
 
Advertisement
Advertisement