శ్వేత పత్రం విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

శ్వేత పత్రం విడుదల చేయాలి

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

ఉన్నత లక్ష్యంతో విడదులైన రూసా నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి. వర్సిటీలోని కొందరు అధికారులు నిధులపై కన్నేశారు. వారి స్వార్థం కోసం నిబంధనలను తుంగలో తొక్కి దుర్వినియోగం చేశారు. అవినీతి ఆరోపణలను అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. నిధుల వినియోగంపై అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలి.

– సుందరరాజు,

ఎన్‌ఎల్‌ఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు, ఎస్వీయూ

అవినీతి రాజ్యమేలింది

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి రుసా నిధు ల్లో అవినీతి రాజ్యమేలింది. కొందరు అధికా రులు నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఖర్చుపెట్టేశారు. ఈ విషయంపై విచారణ చేప ట్టాలని వీసీకి ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోలేదు. ఖర్చుపెట్టిన ప్రతి పైసాపై లెక్క చెప్పాల్సిందే. కొందరు అనవసర సెమినార్‌లు, సదస్సుల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు. – ప్రేమ్‌ కుమార్‌, వైఎస్సార్‌ సీపీ

విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఎస్వీయూ

అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం

స్వలాభం కోసం అధికారులు రూసా నిధులతో తమ అనుచురులకు వర్సిటీ ఉద్యోగాలు కల్పించడం దారుణం. ఇష్టానుసారంగా నిధులను దుర్వినియోగం చేస్తూ తమకు అడ్డులేదని విర్వవీగుతూ వర్సిటీ అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం. తక్షణం నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన, పాల్పడుతున్న అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. – శివశంకర్‌ నాయక్‌, జీఎన్‌ఎస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి

నిజానిజాలు తేల్చాలి

వర్సిటీలో రూసా నిధు ల దుర్వినియోగంపై వస్తున ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలి. పేద విద్యార్థులకు ఉన్న త విద్యను అందించే వర్సిటీ అభివృద్ధికోసం రూసా నిధులను వెచ్చించాల్సిన అధికారులు తమ స్వార్థం కోసం వినియోగించడం దారుణం. రూసా 2.0 ద్వారా నిర్వహించిన సదస్సులు, సెమినార్‌లకు అవసరం కంటే అధిక మొత్తం వెచ్చించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. – శివ బాలాజీ,

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement