శ్రీకాళహస్తి:పిచ్చాటూరురోడ్డులోని శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధ బంగారమ్మ ఆలయంలో సోమవా రం బాలాలయ స్థాపన పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 7గంటలకు వినాయక పూజ, కలశ పూజ, యాగశాలలో పూజలు, హోమం, పూర్ణా హుతి అనంతరం 9.30గంటలకు కలశ ఉద్వాసన, బాలాలయంలో చిత్రపటానికి కలశాభిషేకం, నైవేద్యం, మంత్రపుష్పం, ఆశీర్వచనం, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి, సభ్యులు గుర్రప్పశెట్టి, ప్రత్యేక ఆహ్వానితురాలు శైలజ, డీఈఓ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


