అకడమిక్‌ సెనేట్‌లో పలు కీలక నిర్ణయాలు | - | Sakshi
Sakshi News home page

అకడమిక్‌ సెనేట్‌లో పలు కీలక నిర్ణయాలు

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

తిరుపతి సిటీ: ఎస్వీయూ అకడమిక్‌ సెనేట్‌ సమావేశం ఎట్టకేలకు సోమవారం నిర్వహించారు. వీసీ టాటా నర్సింగరావు అధ్యక్షతన వర్సిటీలోని సెనేట్‌ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, ఆమోదముద్ర వేశారు. ప్రధానంగా ఫార్మసీ విభాగంలో ఫార్మా సూటికల్స్‌, డ్రగ్‌ రెగ్యులేటరీ అనాలసిస్‌ అనే రెండు కొత్త కోర్సులకు ఆమోదం లభించింది. అలాగే ఎంటెక్‌ మెటీరియల్స్‌, మినరల్స్‌ కోర్సులకు సెనేట్‌ ఆమోదం తెలిపింది. ఎన్‌ఈపీ–2020 రెగ్యులేషన్‌ ప్రకారం సిలబస్‌ కొనసాగింపు, బీటెక్‌ 2025 –26 రెగ్యులేషన్స్‌తోపాటు 3, 8వ సెమిస్టర్‌ సిలబస్‌కు అప్రూవల్‌ లభించింది. వర్సిటీ పరిధిలో సీకాం కళాశాల, విజయం కళాశాల, ఎన్‌పీ సావిత్రమ్మ కళాశాలల పొందిన అటానమస్‌ హోదాను ఆమోదించారు. 2025–26 రివైజ్డ్‌ బడ్జెట్‌కు, 2026–27 సాధారణ బడ్జెట్‌కు అకడమిక్‌ సెనెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశంలో రెక్టార్‌ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్‌ ఆచార్య భూపతి నాయుడు, పూర్వ ఉపకులపతులు, సెనేట్‌ సభ్యులు ఆచార్య ప్రభాకర్‌ రావు, ఆచార్య శ్రీకాంత్‌ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement