శ్రీసిటీలో తైవాన్‌ బృందం | - | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో తైవాన్‌ బృందం

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

శ్రీసిటీ(వరదయ్యపాళెం): ౖతెవాన్‌ దేశానికి చెందిన ఐదుగురు వ్యాపార ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. తైవాన్‌ నాన్‌–వోవెన్‌ పాబ్రిక్స్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌(టీఎన్‌ ఎఫ్‌ఏ) సంస్థ చైర్మన్‌ షెల్లీ చియన్‌ నేతృత్వంలో విచ్చేసిన వారికి శ్రీసిటీ ప్రెసిడెంట్‌(ఆపరేషన్స్‌) సతీష్‌ కామత్‌ సాదర స్వాగతం పలికారు. పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా శ్రీసిటీ ప్రత్యేకతలను వివరిస్తూ శ్రీసిటీ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(బిజినెస్‌ డెవలప్‌మెంట్‌) బోడ్గన్‌జార్జ్‌ సమగ్రంగా వివరించారు. తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్‌ సంస్థ శ్రీసిటీలో డైకిన్‌ కంపెనీతో కలసి ప్లాంట్‌ ఏర్పాటు చేయడాన్ని వారి దృష్టికి తెచ్చారు. వీరి పర్యటన చాల ప్రత్యేకమైనదిగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది శ్రీసిటీ, తైవాన్‌ మధ్య ఆర్థిక వ్యాపార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీసిటీ ప్రణాళికాబద్ధ అభివృద్ధి, రాష్ట్రప్రభుత్వ ప్రో–యాక్టివ్‌ దృక్పథాన్ని ప్రశంసించిన షెల్లీ చియన్‌, శ్రీసిఈ సందర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ అద్భుతమని కొనియాడారు. తమ పెట్టు బడులకు శ్రీసిటీ అనువైన క్రేంద్రంగా వావిస్తున్నామని, పరిశ్రమల ఏర్పాటు కోసం తప్పక పరిశీలిస్తామని తెలిపారు. పర్యటనలో భాగంగా తైవాన్‌ ప్రతినిధులు, శ్రీసిటీ అధికారులతో చర్చలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement