● కలెక్టరేట్ వద్ద బీటీఏ నిరసన ● సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం
తిరుపతి అర్బన్: ఉద్యోగుల సమస్యలను పట్టించుకోరా? అని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రభుత్వం సమస్యలకు పరిష్కారం చూపకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 18న విజయవాడలో జరగనున్న మహాధర్నాకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పెర్నాటి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు సిద్ధయ్య, నేతలు మల్యాద్రి, విజయమోహన్, రెడ్డప్ప, నాగరాజు, శేషయ్య, వెంకట్రావ్, సుబ్రమణ్యం, వెంకయ్య, విశ్వనాధ్, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.


