రుయా సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ మనోహర్‌ | - | Sakshi
Sakshi News home page

రుయా సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ మనోహర్‌

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

తిరుపతి తుడా: రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ బి మనోహర్‌ను నియమిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రఘు నందన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుయా సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్‌ రాధ ఉద్యోగ విరమణ చేశారు. ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవి ప్రభుతో పాటు ఉద్యోగ విరమణ చేసిన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధ ఇతర వైద్య అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో రాయలసీమ పరిధిలోని అన్ని మెడికల్‌ కళాశాలలో సీనియర్స్‌ జాబితాలో ముందు వరుసలో ఉన్న రుయా పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ మనోహర్‌ను (ఎఫ్‌ఏసీ) సూపరింటెండెంట్‌గా నియమించారు. సుదీర్ఘకాలం పాటు రుయా చిన్నపిల్లల విభాగంలో ఆయన విస్తృత సేవలు అందించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి విభాగాధిపతిగా 30 వసంతాలకు పైగా విశేష సేవలు అందించారు. చిన్నపిల్ల విభాగంలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అందించే స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి అమోఘం. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం న్యాయబద్ధంగా ఆయనకు దక్కాల్సిన రుయా సూపరింటెండెంట్‌ పోస్టులో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏడీ రమేష్‌, పలువురు వైద్య అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement