దరఖాస్తులకు అవకాశం కల్పించాలని వేడుకోలు పింఛన్ కోసం వేల మంది పేదల నిరీక్షణ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, వ్యాధిగ్రస్తుల ఆవేదన నేడు జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు
తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మాట దెవుడెరుక... కనీసం అర్హత ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు, వితంతువులకు పింఛన్లు ఇస్తే వారంతా సంతోషంగా తమ జీవనం సాగిస్తారు. జిల్లాలో తాజా లెక్కల ప్రకారం (మార్చిలో) 2,64,061 మంది పింఛన్లు తీసుకున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా పింఛన్లకు అర్హత ఉన్నవాళ్లు 60 వేల మందికి పైగా ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్ ఇప్పిస్తే వారి సమస్యలు తీరుతాయని కనిపించిన అధికారి వద్ద బాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
అనుమతి ఎప్పుడు?
అర్హులైన వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వారంతా గ్రామ, వార్డు పరిధిలోని సచివాలయాల నుంచి మండల, డివిజన్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్ వరకు పింఛన్ల కోసం తిరుగుతున్నారు. ఈ క్రమంలో అధికారులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి రాలేదంటూ సమాధానం ఇవ్వడంతో వారంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా అనుమతి ఇవ్వకుంటే...ఇంకెప్పుడు ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రతినెలా జిల్లాలో 500 నుంచి 600 పింఛన్లు తగ్గిపోతున్నాయి. ఎందుకని అధికారులను ప్రశ్నిస్తే వారంతా మృతి చెందారంటూ సమాధానం ఇస్తున్నారు. పింఛన్ల సంఖ్య తగ్గిపోతున్నా..కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండేళ్లుగా ఎదురుచూపులు


