‘పట్టా’భిషేకానికి వేళాయె! | - | Sakshi
Sakshi News home page

‘పట్టా’భిషేకానికి వేళాయె!

Mar 29 2026 6:49 AM | Updated on Mar 29 2026 6:49 AM

– రేపే ఎస్వీ వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవం

చంద్రగిరి:తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి వీసీ డాక్టర్‌ జేవీ రమణ తెలి పారు. శనివారం వర్సిటీలోని వైఎస్సార్‌ పరిపాలనా భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పశు వైద్యకళాశాల ఆడిటోరియంలో చేపట్టే కాన్వొకేషన్‌కు చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరవుతారన్నారు. మహారాష్ట్ర యానిమల్‌ అండ్‌ ఫిషరీ సైన్సెస్‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నితిన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. 2023–24 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ పూర్తి చేసిన 415మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు చెప్పా రు. అందులో 8మంది పీహెచ్‌డీ, 144 మంది ఎంవీఎస్సీ, 227మంది బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, 36 మంది బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నట్లు వివరించారు. అకడమిక్‌ విద్యలో ప్రతి భ చూపిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పలువురు అధ్యాపకులకు రఅవార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. ఉత్తమ డాక్టరేట్‌ పరిశోధనకు శ్రీముప్పవరపు ఫౌండేషన్‌ బంగారు పతకం, పశుపోషణలో విశేష మాస్టర్స్‌ పరిశోధనకు డాక్టర్‌ ప్రతాప్‌ వి రెడ్డి బంగారు పతాకం ప్రదానం చేయనున్నట్లు వివరించారు. రిజిస్ట్రార్‌ వినూ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement