ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల భయం వెంటాడుతోంది. దీంతో వారు ట్యూషన్లు, కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఆ స్థాయి బోధన కళాశాలల్లో అందకపోడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు నూతన సిలబస్‌ను ప్రవేశపెట్టిన ఇంటర్ బోర్డు ఈ మేరకు తగిన సదుపాయాలను విద్యార్థులకు అందించడంలో విఫలమైంది. కేవలం పుస్తకాలను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటోంది. ప్రస్తుతం కళాశాలల్లో 60శాతం మంది అధ్యాపకులు పదవీ విరమణకు చేరువలో ఉన్నారు. వారికి నూతన సిలబస్‌పై తూతూమంత్రంగా శిక్షణ ఇచ్చి బోధించమనడంతో అధ్యాపకులు కాస్త భారంగానే భావిస్తున్నట్లు తెలుస్తోంది.


