సమాధానం చెప్పాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

సమాధానం చెప్పాల్సిందే..

Mar 26 2026 7:18 AM | Updated on Mar 26 2026 7:18 AM

నది పొరంబోకు భూముల్లో అక్రమ కట్టడాలను రెండు నెలల్లో తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆదేశాలను అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేస్తున్నాం. దీంతో కలెక్టర్‌తో పాటు ప్రతివాదులందరూ కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్టు ధిక్కరణ కింద వారికి జరిమానా పడవచ్చు. జైలు శిక్ష కూడా విధించే అవకాశముంది. – పసపాల సుధాకర్‌రెడ్డి, న్యాయవాది

ఉత్వర్తులను అమలు చేస్తాం

చిగురువాడ దక్షిణపు కండ్రిగ సర్వే నంబరు 160లో ఆక్రమణలను తొలగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను తప్పకుండా అమలు చేస్తాం, అక్రమ కట్టడాలను తొలగిస్తాం. ఆయా భూములను స్వాధీనం చేసుకుంటాం. చిగురువాడ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – జనార్ధన్‌రాజు,

తహసీల్దారు, తిరుపతి రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement