తిరుపతి అన్నమయ్య సర్కిల్: పోరాట పటిమతో గత 22 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను ప్రభుత్వం విడుదల చేసిందని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఐహెచ్‌ఎం) తిరుపతి ఉద్యోగులు తెలిపారు. మంగళవారం జూపార్కు రోడ్డులోని ఏపీటీడీసీ ఆవరణలోని ఎస్‌ఐహెచ్‌ఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. సమావేశంలో టీచింగ్ స్టాఫ్ కె.శివరామకృష్ణ, ఎన్‌ఎస్‌కె చౌదరి, ఎస్.భార్గవి, వై.సునీత, బోధనేతర ఉద్యోగులు అమిదున్నీసా, సి.నరేష్. పి. జ్యోత్స్నాదేవి, త్యాగరాజ, రమాదేవి, వాణి, మాధవరావు, శ్రీనివాస్‌రెడ్డి, ప్రమీల, మున్నా తదితరులు పాల్గొన్నారు.


