తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ముగ్గురు స్మగ్లర్లకు ఐదేళ్లు జైలుశిక్ష, విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం... ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం 2016లో చంద్రగిరి మండలంలోని ముంగిలిపట్టు, పనపాకం ఫారెస్ట్ బీట్, తిరుపతి రేంజ్, చిత్తూర్ డివిజన్ పరిధిలో తనిఖీలు చేసింది. ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలుగా కట్ చేసి, వాహనాల్లో తరలించడానికి యత్నిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రాధమిక విచారణలో వీరు తమిళనాడు, సేలం జిల్లా, కడియం బట్టు తాలూకా పుమరతురు గ్రామానికి చెందిన ఎస్ తంగరాజ్, ఆర్కాట్ తాలూకా, సెనగల తుంపాడికి చెందిన టి.రాజేంద్రన్, కర్ణాటకలోని సజ్జాపురకు చెందిన బి.నవాజ్ అని తేలింది. కేసు తుది విచారణగా రాగా నిరూపితం కావడంతో తంగరాజ్, రాజేంద్రన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3.10లక్షల జరిమానా, నవాజ్‌కు ఐదేళ్లు జైలు శిక్షతోపాటు రూ.6.10లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.


