తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ, అవగాహన ర్యాలీ మంగళవారం నిర్వహించారు. రుయా వద్ద ర్యాలీని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. క్షయ అనుమానిత లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నివారణ సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్బారావు, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ జే.రాధ, డాక్టర్ రవిరాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


