గోవిందనామస్మరణతో మార్మోగే తిరునగరిలో మంగళవారం ఓ అపురూపం దర్శనమిచ్చింది. పవిత్ర తిరునామం స్పురించేలా ఓ సీతాకోకచిలుక భక్తులను ఆకట్టుకుంది. శ్రీవారి నుదుటిన వెలుగొందే మూడు నామాల తరహాలో కనిపించిన ఈ అద్భుతానికి ప్రజానీకం ప్రణమిల్లింది.
తిరుపతి నగరంలో మంగళవారం వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పరమేశ్వరుని మహిమాన్విత రూపం దర్శనమిచ్చింది. దేదీపంగా ప్రకాశిస్తూ మహాలింగరూపం సాక్షాత్కరించింది. కట్టెదుట కనిపించిన దివ్యతేజస్సును వీక్షించి భక్తజనం పులకించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి


