నాగలాపురం: నాగలాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేదనారాయణ స్వామివారి సూర్య పూజ తెప్పోత్సవాలకు మంగళవారం వైభవంగా శ్రీకారం చుట్టారు. ఐదరోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు దేవదేవేరులకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. ఈ క్రమంలోనే సాయంత్రం భానుడి కిరణాలు వేదనారాయణుని గర్భాలయాన్ని స్పృశించడంతో భక్తుల పులకించారు. గోవింద నామస్మరణలతో పరవశించారు. అనంతరం ఉభయదేవేరీ సమేతంగా స్వామివారిని విశేషంగా అలంకరించి తెప్పలపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు.. వేదమంత్రోచ్ఛారణల నడుమ నేత్రపర్వంగా తెప్పోత్సవం నిర్వహించారు.


