తిరుపతి అర్బన్ : గ్రీవెన్స్‌లో ప్రజలు వివిధ సమస్యలపై అందించే వినతులను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చే అర్జీలను పెండింగ్‌లో ఉంచకూడదని స్పష్టం చేశారు. అలాగే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను వేగవంతం చేయాలని కోరారు. అక్షర ఆంధ్ర ద్వారా అక్షరాస్యతను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, డీసీహెచ్‌ఎస్ ఆనందమూర్తి, డీఎస్‌ఓ శేషాచలంరాజు, డీసీఓ నాగవర్ధిని, జీఎస్‌డబ్ల్యూఎస్ కో–ఆర్డినేటర్ జగదీష్ పాల్గొన్నారు.


