వాటర్‌ ప్లాంట్లకు అనధికారికంగా విద్యుత్‌ వినియోగం | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ ప్లాంట్లకు అనధికారికంగా విద్యుత్‌ వినియోగం

Mar 24 2026 6:50 AM | Updated on Mar 24 2026 6:50 AM

● డయల్‌ యువర్‌ సీఎండీలో ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి ● తక్షణ చర్యలకు ఆదేశించిన సీఎండీ శివశంకర్‌

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని వా టర్‌ ప్లాంట్లకు అనధికారికంగా విద్యుత్‌ వినియోగిస్తున్నారని అందిన ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి అధికారులను ఆదేశించారు. ఏపీఎస్పీడీసీఎల్‌ కా ర్పొరేట్‌ ఆఫీసులో సోమవారం జరిగిన డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమంలో కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఒక వినియోగదారుడు మాట్లాడుతూ తమ ప్రాంతంలో నిర్వహిస్తున్న రెండు వాటర్‌ ప్లాంట్లు రూ.లక్షల్లో వి ద్యుత్‌ బిల్లులు బకాయిలు పడ్డాయని, బిల్లు చె ల్లించని కారణంగా సిబ్బంది ఆ సర్వీసులకు వి ద్యుత్‌ సరఫరా నిలిపివేస్తే అనధికారికంగా విద్యుత్‌ను వినియోగించుకుంటూ సంస్థకు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు.ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎండీ శివశంకర్‌ తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ చౌర్యం జరిగేది నిజమని తేలితే కేసు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సిబ్బందిపై విచారణ జరిపి వారి పాత్ర ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంస్థకు నష్టం కలిగించే ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. 50 మంది వినియోగదారులు తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకు రావడంతో నో డల్‌ ఆఫీసర్లు వాటిని పరిష్కరించాలన్నారు. సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్‌ ఖాన్‌, డైరెక్టర్‌ కె. గురవయ్య, కె. రామమోహన్‌ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement