తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి అహ్మదాబాద్‌కు చెందిన అరిహంత్ డెస్ట్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు రూ.11 లక్షల విరాళం ఇచ్చారు. ప్రతినిధుల కోరిక మేరకు సోమవారం తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ రవిచంద్రకు విరాళ డీడీ అందజేశారు. ఈ మొత్తాన్ని పేద రోగులకు వైద్య సేవలకు ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ దాతలకు ధన్యవాదాలు తెలియజేసి, వారి సేవాభావాన్ని అభినందించారు.


