వెంకటగిరి రూరల్: పట్టణంలోని ఏపీ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఆర్‌జేసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ పి.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతోపాటు నాగార్జున సాగర్‌లోని డిగ్రీ కళాశాలలో బీఏ (40), బీకామ్(60) బీఎస్సీ(120), వెంకటగిరి జూనియ ర్ కళాశాలలో ఎంపీసీ (60) బైపీసీ(40), ఎంఈసీ (30) ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే తిరుపతి జిల్లాలోని చిలమానుచేను, ముక్కవారిపల్లి బాలుర పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశానికి (80) సీట్లు, వెంకటగిరి బాలికల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి (80) సీట్లు , 6,7,8 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా అధికార వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 24వ తేదీన ప్రవేశ పరీక్ష తిరుపతిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 87126 25075, 87126 25050, 87126 25056, 87126 25049 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
చెక్‌పోస్టు ఉద్యోగిపై దాడి
సూళ్లూరుపేట: మన్నారుపోలూరులో వద్ద ఉన్న మినీ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ అనే ఉద్యోగిపై అధికారపార్టీకి చెందిన చోటా నాయకులు ఆదివారం దాడి చేశారు. అధికారపార్టీకి చెందిన ఒక చోటా నేత ట్రాక్టర్‌లో మెటల్ తీసుకుండగా చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ టాక్స్ కట్టమన్నారు. అధికార పార్టీలో ఉన్న తమనే టాక్స్ కట్టమంటావా! ఎంత ధైర్యం నీకు.. అని అనడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో వెంకటరమణ ట్రాక్టర్ తాళాలు తీసుకోవడంతో అతనిపై అధికారపార్టీకి చెందిన కొంతమంది చోటా నాయకులు దాడి చేశారు.


