తెప్పపై మలయప్ప వైభవం | - | Sakshi
Sakshi News home page

తెప్పపై మలయప్ప వైభవం

Mar 3 2026 7:18 AM | Updated on Mar 3 2026 7:18 AM

● రేణిగుంటకు చెందిన ఓ గర్భిణిని తిరుపతి రెడ్డి అండ్‌ రెడ్డి కాలనీలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌కు గత నెల 14వ తేదీన తీసుకువచ్చారు. అప్పటివరకు స్కానింగ్‌తోపాటు అన్ని రిపోర్టులు పక్కాగా ఉన్నా, అక్కడి వైద్యులు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. చేసేదిలేక ఆస్పత్రివారిచ్చిన ఫామ్‌పై సంతకం చేసి అంగీకారం తెలిపారు. దీంతో రూ.60 వేలు చెల్లించి ఆ తల్లి కడుపు కోసి, బిడ్డను బయటకు తీసి కడుపు కుట్టి ఇంటికి పంపించారు. ● తిరుపతి కొర్లగుంటకు చెందిన ఓ గర్భిణికి నాలుగేళ్ల కిందట తిరుపతిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో సిజేరియన్‌ చేశారు. మరుసటి ఏడాది కూడా రెండోసారి గర్భం దాల్చినప్పుడు కొందరి సూచనల మేరకు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. మొదటి బిడ్డకు సిజేరియన్‌ చేయడంతో కొన్ని సమస్యలు తలెత్తడంతో రెండో కాన్పుకు కూడా కచ్చితంగా సిజేరియన్‌ చేయాల్సి వచ్చింది. రెండుసార్లు సిజేరియన్‌ కావడంతో ప్రస్తుతం ఆ తల్లి వివిధ గైనిక్‌ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. కడుపు కూడా సాధారణ స్థితి కంటే రెండింతలు ఎత్తుగా ఉండడంతో ఇబ్బంది పడుతోంది.

శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు తెప్పపై కొలువుదీరి పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి, భక్తులను కటాక్షించారు. వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఉత్సవంలో తిరుమల పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌ స్వామి, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు. – తిరుమల

తెప్పలపై విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు

జిల్లాలో ప్రసవాల సమాచారం

2024లో...

నెల సుఖప్రసవాలు సిజేరియన్స్‌ మొత్తం

ఏఫ్రిల్‌ 1417 1184 2601

మే 1490 1179 2669

జూన్‌ 1500 1145 2645

జూలై 1520 1118 2638

ఆగష్టు 1520 1303 2823

సెప్టెంబర్‌ 1568 1314 2882

అక్టోబర్‌ 1572 1338 2910

నవంబర్‌ 1466 1285 2751

డిసెంబర్‌ 1496 1135 2631

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement