వెంకటకృష్ణయ్య ఇంటికి రూ. 21వేలు | - | Sakshi
Sakshi News home page

వెంకటకృష్ణయ్య ఇంటికి రూ. 21వేలు

Feb 20 2026 6:59 AM | Updated on Feb 20 2026 6:59 AM

వెంకట

వెంకటకృష్ణయ్య ఇంటికి రూ. 21వేలు

బిల్లులు చెల్లిస్తారా? కరెంటు కట్‌ చేయమంటారా?

పలువురి ఇళ్లకు కరెంటు కట్‌

ఆందోళన చెందుతున్న బాధితులు

చిన్న పాండూరు అరుంధతివాడలోని వెంకటకృష్ణయ్య ఇంటికి ఒక్కసారిగా పాత బకాయిల పేరిట ఉన్న రూ. 21 వేలు బిల్లును అందజేశారు. దీంతో విద్యుత్‌ సరఫరాను సైతం ఆపి వేశారు. ఉన్న ఫళంగా ప్రభుత్వం ఇలా వ్యవహరించడంతో తమలాంటి నిరుపేదలకు ఎంతో భారమైందని వారు ఆవేదన చెందుతున్నారు. అలాగే అదే అరుంధతివాడ కు చెందిన మరో వినియోగదారురాలు బి.మన్నె మ్మ పేరిట రూ. 50241 విద్యుత్‌ బకాయిలు ఉన్న ట్లు వారి కుటుంబ సభ్యుడైన పరశురాం ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

ఎస్టీ, ఎస్సీలకు ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తోంది.. ఈ మేరకు వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు..ఈ క్రమంలో వారు ఏళ్లుగా విద్యుత్‌ చార్జీలను చెల్లించడం లేదు.. అయితే ఏడేళ్ల కిందట రూ.వేలల్లో బకాయిలున్నారని..వాటిని చెల్లిస్తేనే కానీ విద్యుత్‌ సరఫరా చేయమని సర్వీసులు కట్‌ చేస్తున్నారు. ఉన్నఫళంగా తాము పెద్దమొత్తంలో బకాయిల బిల్లులు ఎలా చెల్లించాలని వారు మదనపడుతున్నారు.

వరదయ్యపాళెం: చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్‌ బకాయిలకు సంబంధించి దళితులపై వేధింపులు మొదలయ్యాయి. ఆ దిశగా వరదయ్యపాళెం మండలంలోని పలు అరుంధతివాడలు, దళితవాడల్లో విద్యుత్‌ సిబ్బంది రెండు రోజులుగా పాత బకాయిలు చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు. బకాయి ఉన్న బిల్లులు చెల్లించకపోతే ఏకంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తూ సర్వీస్‌ వైర్లను కట్‌ చేస్తున్నారు. ఆ మేరకు చిన్న పాండూరు అరుంధతివాడలో 15 మంది ఇళ్లకు పాత బకాయిలు చెల్లించలేదని సరఫరా కట్‌ చేసినట్లు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఎప్పుడో ఏడేళ్ల కిందటి బకాయిలు ఇప్పుడు ఉన్న ఫళంగా చెల్లించమంటే రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబాలైన తాము ఎలా చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్‌ అధికారులు తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు ఒక్కో ఇంటికి రూ. 30 వేలు నుంచి రూ.60 వేలు వరకు పాత బకాయిలకు సంబంధించి బిల్లులు ఇవ్వడం గమనార్హం. కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా పాత బకాయిలు చెల్లించమని పేద ప్రజలను ఇలా వేధించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అని, గత ప్రభుత్వంలో ఒకరోజు కూడా ఇలాంటి వేధింపులు జరగలేదని వారు చెబుతున్నారు.

అన్నిచోట్ల బకాయిల వసూళ్లకు సిద్ధం

మండల వ్యాప్తంగా దళితవాడల్లో, అరుంధతివాడల్లో పాత విద్యుత్‌ బకాయిల వసూళ్లకు విద్యుత్‌ సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఆ దిశగా వరదయ్యపాళెం మండలంలో కొద్ది రోజులుగా ఈ వసూళ్ల పర్వం జరుగుతోంది.

బి. మన్నెమ్మ పేరిట వచ్చిన రూ. 50,241 బిల్లు

దళితులపై పాత బకాయిల కత్తి

వెంకటకృష్ణయ్య ఇంటికి రూ. 21వేలు 
1
1/1

వెంకటకృష్ణయ్య ఇంటికి రూ. 21వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement