సీమకు ఆర్థిక కేంద్రంగా తిరుపతి
తిరుపతి అర్బన్: రాయలసీమకు తిరుపతి ఓ ఆర్థిక కేంద్రంగా మారనుందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. జిల్లా పారిశ్రామిక ప్రవర్తనపై సీఐఐ నేతృత్వంలో గురువారం తాజ్‌హోటల్‌లో పారిశ్రామిక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐఐ తిరుపతి జోన్ చైర్మన్‌గా కజారియా సెరామిక్స్ లిమిడెట్ సీఓఓగా ఉన్న ఎస్పీ రాజేంద్రన్‌ను అలాగే, వైఎస్ చైర్మన్‌గా ఎక్సాప్లూయెన్స్ ఇంక్ సీఓఓ టీఎన్ శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి హజరైన కలెక్టర్ మాట్లాడుతూ త్రిభుజ ప్రాంతానికి తిరుపతి కేంద్ర బింధువు కానుందని వెల్లడించారు. తిరుపతికి చైన్నె, బెంగళూరు, నెల్లూరు నగరాలకు వయా తిరుపతిగా మారనున్న నేపథ్యంలో జిల్లా మరింత అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. ఈ క్రమంలో తిరుపతి మరో 20 ఏళ్లకు పారిశ్రామిక ఇంజినన్‌గా మారనుందని వెల్లడించారు.


