ట్రెండ్స్‌ స్థలం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ట్రెండ్స్‌ స్థలం పరిశీలన

Feb 20 2026 6:59 AM | Updated on Feb 20 2026 6:59 AM

ట్రెండ్స్‌ స్థలం పరిశీలన

ట్రెండ్స్‌ స్థలం పరిశీలన

● కార్మికుల జీతాల చెల్లింపునకు స్క్రాప్‌ వేలం నిర్వహణ ● భవిష్యత్తు అవసరాలకు ట్రెండ్స్‌ స్థలం

తిరుపతి మంగళం: మంగళంలోని ట్రెండ్స్‌ స్థలాన్ని గురువారం అధికారులు పరిశీలించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ది రూరల్‌ ఎంటర్ర్‌పైన్యూల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (ట్రెండ్స్‌ మంగళం ప్రాజెక్ట్‌) స్థలాన్ని, ఈ సొసైటీకి ఉన్న ఆర్థిక చిక్కుముడులను తొలగించి భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవడానికి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో తిరుపతి ఆర్డీఓ లిక్విడేటర్‌ హోదా లో గురువారం టూరిజం శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ ర మణ ప్రసాద్‌, సెట్విన్‌ సీఈఓ యశ్వంత్‌, మండల సర్వే, రెవెన్యూ అధికారులతో కలసి ట్రెండ్స్‌ స్థలాన్ని పరిశీలించారు. మంగళం పరిధి సర్వే నంబర్‌ ఒకటి లోని దాదాపు 5.50 ఎకరాల విస్తీర్ణంలో ట్రెండ్స్‌ ఉంది. గతంలో వినియోగించిన 11 యూనిట్లు ప్రింటింగ్‌, స్టేషనరీ, వెల్డింగ్‌, తదితర యూనిట్లలో మిషనరీ నేడు తుప్పుపట్టి ఉంది. ఈ యూనిట్ల పరిస్థితిని అధికారులు పరిశీలించి స్క్రాప్‌ వేలానికి అంచనాలు సిద్ధం చేయాలని లిక్విడేటర్‌ హోదాలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామ్మో హన్‌ మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలకు ప్రభు త్వ స్థలాలను గుర్తించి పరిరక్షిస్తున్నామని, ప్రభుత్వ యంత్రాంగానికి సేవ లు అందించిన ట్రెండ్స్‌ 2014 నుంచి నిరుపయోగంగా ఉందన్నారు. ఇందులో పనిచేసే కార్మికులకు జీతాలు చెల్లింపు ఇతరత్ర అవసరాలకు స్క్రాప్‌ అంచనాలు తయారీ తరువాత వేలం ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. స్క్రాప్‌ వేలం ద్వారా వచ్చిన డబ్బును కార్మికుల జీతభత్యాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని ద్వారా ఈ ట్రెండ్స్‌ స్థలానికి ఉన్న ఆర్థిక చిక్కుముడులను తొలగించనున్నామన్నారు. అటు తరువాత కలెక్టర్‌ ఆదేశాలతో ట్రెండ్స్‌ స్థలాన్ని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. 1985 దశకం నుంచి ట్రెండ్స్‌ ఏర్పాటుతో ఇక్కడే కార్మికులుగా పనిచేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, 2014 తరువాత తమకు జీతాలు ఇవ్వలేదని, జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ చాలా ఇబ్బందికరంగా మారిపోయిందని, ఇదివరకే అధికారులకు వినతిపత్రాలు కూడా సమర్పించామని ఆర్డీఓ దృష్టికి ట్రెండ్స్‌ కార్మికులు తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ జిల్లా కలెక్టర్‌ దృష్టికి ఈ సమస్యను తీసుకెళతామని హామీ ఇచ్చారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది ట్రెండ్స్‌ స్థలాన్ని పరిశీలించారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన చెవిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement