అనధికారిక డ్రైవింగ్‌ స్కూళ్లపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

అనధికారిక డ్రైవింగ్‌ స్కూళ్లపై చర్యలు

Feb 19 2026 10:11 AM | Updated on Feb 19 2026 10:11 AM

అనధికారిక డ్రైవింగ్‌ స్కూళ్లపై చర్యలు

అనధికారిక డ్రైవింగ్‌ స్కూళ్లపై చర్యలు

తిరుపతి మంగళం : తిరుపతి జిల్లా పరిధిలో అనుమతి లేకుండా డ్రైవింగ్‌ స్కూల్స్‌ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖాధికారి కె.మురళీమోహన్‌ హెచ్చరించారు. ఆయన బుధవారం డ్రైవింగ్‌ స్కూల్స్‌ యజమానులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్‌ స్కూళ్లు నిర్వహించాలంటే రవాణాశాఖ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌లకు ద్విచక్ర వాహనం, కారుకు రూ.1260 చెల్లించాలని సూచించారు. అలా కాకుండా ఎక్కువగా వసూలు చేయరాదన్నారు. సమావేశంలో ఎంఈఐలు శ్రీనివాసరావు, దామోదర్‌ నాయుడు, అతికానాజ్‌, మోహన్‌ కుమార్‌, ఆంజనేయ ప్రసాద్‌, స్వర్ణలత, ఏవోలు విజయ్‌ కుమార్‌ , విజయ్‌ ప్రశాంతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement