ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట ఫారెస్ట్ రేంజ్‌లో భాకరాపేట రేంజ్ అటవీ క్షేత్రాధికారి ఎన్.వెంకటరమణ నేతృత్వంలో అటవీ సిబ్బంది శనివారం దాడులు చేసి, ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎరచ్రందనం దుంగలు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దిన్నెల అటవీ పరిసర ప్రాంతాల నుంచి ఎరచ్రందనం అక్రమంగా తరలిస్తున్నారన్న రహస్య సమాచారం మేరకు శుక్రవారం రాత్రి రేంజ్ సిబ్బంది, బేస్ క్యాంపు, స్ట్రైక్ ఫోర్స్ ప్రొటెక్షన్ వాచర్లు తలకోన నార్త్ బీట్ పరిధిలోని వీఆర్ కాలనీ సమీపంలో నిఘా పెట్టారు. శనివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా వచ్చిన కారును ఆపేందుకు ప్రయత్నించగా, కోటకాడపల్లి దిన్నెల రోడ్డులో వీఆర్.కాలనీ వద్ద కారు వదిలి కొందరు పారిపోవడానికి యత్నించారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకుమార్, శక్తివేల్ ముత్తు, బాబు దొరైరాజ్, కే.శక్తి, శివకుమార్ (సెంజి), అనుమన్ అనే వ్యక్తులను అటవీ సిబ్బంది చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. కారులోని 167 కిలోల బరువున్న 6 ఎరచ్రందనం దుంగలను కారుసహా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కారు, ఎరచ్రందనం విలువను సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఓ బి. మునిస్వామి నాయక్, ఎఫ్‌బీఓలు వై.రాజేష్ కుమా ర్, జి.ప్రదీప్, జే.బి.నిఖిల్, ఎం.సదాశివయ్య, సి.రవి, డ్రైవర్ హెచ్.శంకర్, తేజ పాల్గొన్నారు.


