ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్
తిరుపతి సిటీ: ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిగా నిలిచి ప్రశంసలు పొందుతోందని వక్తలు కొనియాడారు. జాతీ య సంస్కృత యూనివర్సిటీలో శుక్ర వారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత్ గొప్పతనం, సాంస్కృతి సంప్రదాయాలు, విజ్ఞానాన్ని, లక్ష్యాలను, ప్రగతిని చాటి చెప్పేందుకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం సరైన వేదిక అని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరుసార్లు భారతీయ విజ్ఞాన సమ్మేళం నిర్వహించామని, తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత తొలి సారి సమ్మేళనం నిర్వహించడం శుభపరిణామని తెలిపారు. ఈ సందర్భంగా సమ్మేళానికి హాజరైన సీఎం, ఆర్‌ఎస్ ఎస్ చీఫ్, అతిథులను వర్సిటీ అధికారు లు ఘనంగా సన్మానించారు. తరువాత సమ్మేళనంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు పరిశీలించి అభినందించా రు. సమగ్ర వికాసానికి భారతీయ చింతన అనే భావంతో ఎన్‌ఎస్‌యూ, కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మేళనానికి కేంద్రపాలి త ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1,250 మంది ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ ఔనత్యాన్ని చాటిచెప్పేలా పలు అంశాలపై వారు ఈ సమ్మేళనంలో పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం సమ్మేళనం ప్రారంభం అనంతరం వర్సిటీలోని చెలికాని అన్నారావు భవన్‌లో ఎన్‌ఎస్‌ఏబీ సభ్యులు, మాజీ డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్ విజ్ఞాన్ సమ్మేళనంపై ప్రత్యేక ప్లీనరీ సెషన్ నిర్వహించారు. డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రిక కౌషిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ స్టాళ్లు
సంస్కృత యూనివర్సిటీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లు ఆకట్టుకున్నా యి. ఇందులో భాగంగా పలు విభాగాలకు చెందిన సుమారు 70 స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్‌డీఓ, హస్తకళ ప్రదర్శనలు, కలంకారీ, ఐకేఎస్ సిస్టమ్, లేపాక్షి హస్తకళావస్తు ప్రదర్శన, ఎన్‌ఎస్‌యూ, కేఎల్ యూనివర్సిటీ పబ్లికేషన్స్, ఉడ్ కవరింగ్ స్టాళ్లు, విజ్ఞాన భారతి పబ్లికేషన్స్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ నమూనా, బీవీఎస్ ప్రయోగ దిక్సూచి ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణలను వీక్షకులను ఆకట్టుకున్నాయి.


