వైద్య విద్యపై నీచ రాజకీయం
వైఎస్సార్‌సీపీ పాలనలో పేదలకు మరింత మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉన్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను స్థాపించారు. అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దురాలోచనతో వైద్య విద్యపై నీచ రాజకీయాలు చేస్తున్న ప్రజాద్రోహి చంద్రబాబు. – భూమన కరుణాకరరెడ్డి,
చిత్తూరు,తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
తిరుగుబాటు తప్పదు
కూటమి ప్రభుత్వం నియంత పోకడలతో ముందుకెళ్తోంది. ఇది ప్రజా తిరుబాటుకు నాంది. ఈ తిరుబాటు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించివేస్తుంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు. ప్రజా వ్యతిరేకానికి నిదర్శనమే మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి 30లక్షల సంతకాలు. సూపర్‌సిక్స్ లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం లేదు.
– ఆర్కే.రోజా, మాజీ మంత్రి


