సైబర్‌ మోసగాళ్ల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసగాళ్ల ముఠా అరెస్ట్‌

Nov 20 2025 7:02 AM | Updated on Nov 20 2025 7:02 AM

సైబర్‌ మోసగాళ్ల ముఠా అరెస్ట్‌

సైబర్‌ మోసగాళ్ల ముఠా అరెస్ట్‌

● 8 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం ● రెండు జాయింట్‌ అకౌంట్లలో నగదు ఫ్రీజ్‌ ● జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి క్రైమ్‌: డిజిటల్‌ అరెస్టు ముసుగులో జిల్లా లో రూ.కోట్ల దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్ల ముఠా సభ్యులు ఎనిమిది మందిని అరెస్టు చేశామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల నుంచి రెండు సె ల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే ఆ ముఠా సభ్యులకు చెందిన రెండు జాయింట్‌ అ కౌంట్లను సీజ్‌ చేసి, అందులో ఉన్న రూ.2.50 లక్షల నగదును ఫ్రీజ్‌ చేసినట్లు తెలిపారు. అరెస్టయిన నిందితుల్లో అనంతపురం జిల్లాకు చెందిన దండే క్రాంతి కుమార్‌, నిమ్మల పవన్‌ కుమార్‌, హైదరాబాద్‌కు చెందిన మానే కోటి బాబు, రాజమండ్రి నివాసి పరిపాల శ్రీనివాస్‌, బళ్లారి వాసులు మరకట్టు చంద్రశేఖర్‌రెడ్డి, కోడెల శివశంకర్‌, నాగరి దన్‌ ప్రశాంత్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన గుండవెని గౌతమ్‌ని అరెస్టు చేశామన్నారు.

కేసు ఛేదన ఇలా..

తిరుపతికి చెందిన ఓ వృద్ధుడు (65)కి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సప్‌ కాల్‌ చేసి ముంబై నుంచి సీబీఐ అధికారులుగా తమను పరిచయం చేసుకున్నారు. రూ.583 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో నీ పేరు ఉందని చెప్పి ఆయన్ను భయపెట్టారు. వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా విచారణ చేస్తామని నమ్మించారు. అతని బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి వివిధ ఖాతాలకు డబ్బు పంపాలని ఒత్తిడి చేసి మోసం చేశారు. ఇలా మొత్తం రూ.80 లక్షలను వివిధ రాష్ట్రాల్లోని మ్యూల్‌ ఖాతాల్లో జమ చేసినట్లుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. బాధితుడు మోస గాళ్లు స్పందించకపోవడంతో సైబర్‌ నేరం జరిగినట్లుగా గ్రహించి ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా బాధితులు ఖాతా నుంచి ముందుగా రెండు మ్యూల్‌ ఖాతాలకు నిధులు చేరినట్లుగా గుర్తించామన్నారు. విచారణలో ప్రధాన నిందితుడు కోటి బాబుకు టెలిగ్రామ్‌ ద్వారా హర్యాణాలోని డానియల్‌, చైనాకు చెందిన తెన్‌, డి పేర్లతో ఉన్న విదేశీ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కోటిబాబు గత ఏడాది జనవరిలో కంబోడియాకు వెళ్లి 24 రోజులపాటు అక్కడ సైబర్‌ మోసగాళ్ల నెట్‌వర్క్‌తో కలిసి పనిచేసి తిరిగి వచ్చి శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌ రెడ్డి శివశంకర్‌ ప్రతాప్‌ రెడ్డి గౌతమ్‌ తదితరుల ద్వారా భారీ సంఖ్యలో మ్యూల్‌ ఖాతాలను సేకరించేవాడని నిర్ధారించమన్నారు. అకౌంట్లో వివరాలు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సాక్షులు అని టెలిగ్రామ్‌ ద్వారా విదేశాలకు పంపిస్తూ ప్రతి రాలా దేవీలపై కమిషన్‌ పొందే వారిని విచారణలో తేలింది. అలాగే క్రాంతి కుమార్‌, పవన్‌ కుమారులు డీకేక్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పేరుతో తప్పుడు పత్రాలతో జాయింట్‌ కరెంట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారన్నారు. ఆ ఖాతాల్లోకి కేసులకు సంబంధించిన రూ.30 లక్షలు జమై, అనంతరం మొత్తాన్ని విదేశీ సైబర్‌ నెట్‌వర్క్‌ ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు నిర్ధారణ అయింది. ఇదే ఖాతాను మరికొన్ని కేసుల్లో కూడా వినియోగించినట్లుగా బయటపడిందని దానిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అదనంగా ఈ అకౌంట్‌ తెరవడంలో సంబంధిత బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉందా లేదా? అనేది కూడా విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు మహమ్మద్‌(యూసఫ్‌ గూడ హైదరాబాద్‌) అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

సైబర్‌ నేరగాళ్లు చూపించే ఆశలకు లొంగద్దు

సైబర్‌ నేరగాళ్లు తమ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే కమిషన్‌ ఇస్తామని, కేవైసీ పంపు, నెలవారీ ఆదాయం వస్తుందని, కొత్త కరెంట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే జీతం వస్తుందని మాయమాటలు చెప్తే మోసపోకండని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఏదైనా నేరం జరిగితే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930ను సంప్రదించాలన్నారు. లేదా తిరుపతి పోలీస్‌ వాట్సప్‌ 8099999977 సంప్రదించాలని కోరారు. ఈ కేసును ఛేదించడంలో ఈస్ట్‌ సీఐ శ్రీనివాసులు, సైబర్‌ క్రైమ్‌ సీఐ వినోద్‌ కుమార్‌ ఎంతగానో కృషి చేశారని తెలిపారు.

చైన్‌ స్నాచర్‌ అరెస్ట్‌

తిరుపతి క్రైమ్‌: నగరంలో ఒకేరోజు ఐదుగురి వద్ద చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ముఠా సభ్యుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకేరోజు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి ఐదు చోట్ల చైన్‌ చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారన్నారు. అలిపిరి పోలీసులు ఇతని పట్టుకోవడానికి ఇటీవల నిరంతరం తనిఖీలు చేపట్టగా మంగళవారం ఆటోనగర్‌ కాటన్‌ మిల్‌ సమీపంలోని రైల్వే గేట్‌ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పల్సర్‌ బైకుపై కనిపించాడన్నారు. అతన్ని తమదైన శైలిలో విచారించగా ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షమ్మీ జిల్లాకు చెందిన గురుమాక్‌ గురుమాక్‌(53)గా గుర్తించామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బావారియా ముఠాకు చెందిన సభ్యుడని తెలిపారు. ఇతను కేరనా, షామ్లీ, షహరాన్పూర్‌ జిల్లాలో ఇళ్ల దొంగతనాలు కేసులో జైలుశిక్ష అనుభవించారన్నారు. మరో ఇద్దరితో కలిసి ఈ చైన్‌న్స్‌ స్నాచింగ్‌ పాల్పడినట్లుగా విచారంలో తెలిపారన్నారు. ఈ కేసులో జయరాం, మోహన్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 4వ తేదీన ఎల్జీ సర్వీస్‌ సెంటర్‌ వద్ద పార్క్‌ చేసిన పల్సర్‌ బైక్‌ని దొంగలించి అదే బైకుపై చైన్‌ స్నాచింగ్‌ పాల్పడినట్లుగా విచారణలో తేలిందన్నారు. ఇతను వద్ద నుంచి పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని మిగతా సొత్తును రికవరీ చేస్తామన్నారు. ఈ కేసును ఛేదించడంలో లాండ్‌ అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ ఎస్పీ రవి మనోహరా చారి సీఐ రామకిషోర్‌, ఎస్‌ఐ నాగార్జున రెడ్డి, ఎంతగానో కృషి చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement