ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో పీఎం కిసాన్‌ ప్రత్యక్ష ప్రసారం | - | Sakshi
Sakshi News home page

ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో పీఎం కిసాన్‌ ప్రత్యక్ష ప్రసారం

Nov 20 2025 7:02 AM | Updated on Nov 20 2025 7:02 AM

ఎస్వీ

ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో పీఎం కిసాన్‌ ప్రత్యక్ష ప్రసారం

చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో బుధవారం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పఽథకంపై ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం దేశ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. విశ్వ విద్యాలయ ప్రాంగణంలో డెయిరీ టెక్నా లజీ కళాశాల ఆడిటోరియంలో ఈ కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వీసీ జేవీ రమణ, డైరెక్టర్‌ శోభామణి, డీన్‌ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రైతు శ్రేయస్సు కోసం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పరిశోధన, విస్తరణ, శిక్షణ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

లెక్చరర్‌ ఆత్మహత్య

తిరుపతి క్రైమ్‌: భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన కర్ణాటక లెక్చరర్‌ తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్‌ పోలీసుల కథనం మేరకు... కర్ణాటక రాష్ట్రం తుమకూరుకు చెందిన సతీష్‌ కుమార్‌(35) తన స్వగ్రామంలోనే ఫ్రీ యూనివర్సిటీలో హిస్టరీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య యమునా, ఓ కొడుకు ఉన్నాడు. ఇటీవల ఆయన నూతన ఇంటిని నిర్మించుకుని కొద్దిగా అప్పుల పాలయ్యారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరిగేవి. భార్య సర్ది చెప్పినా కూడా పెద్దగా వినేవాడు కాదు. అదే తలచుకొని బాధపడుతుండేవాడు. రెండు రోజుల క్రితం భార్య సరిగా మాట్లాడకపోవడంతో ఈ నెల 17వ తేదీన తిరుపతి కొచ్చి నగరంలోని పెద్ద కాపు వీధిలో ఉన్న ఓ లాడ్జిలో రూమ్‌ని అద్దెకు తీసుకున్నాడు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్న సమయానికి రూమ్‌నకు చేరుకున్నాడు. అయితే అప్పటి నుంచి రూమ్‌లో నుంచి బయటికి రాలేదు. ఇంతలో యమునా కర్ణాటకలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి తిరుపతిలో ఉన్నాడని తెలుసుకుని తిరుపతికి చేరుకుంది. సతీష్‌ కుమార్‌కు ఫోన్‌ చేయగా లాడ్జి యాజమాన్యం ఫోన్‌ ఎత్తి సతీష్‌ కుమార్‌ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లుగా బుధవారం తెలిపారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో పీఎం కిసాన్‌ ప్రత్యక్ష ప్రసారం1
1/1

ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో పీఎం కిసాన్‌ ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement