నకిలీ బంగారంతో రుణాలు
– 8లో
చిన్నగొట్టిగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో భారీ కుంభకోణం జరిగింది. విచారణ చేపట్టనున్నారు.
బెదిరిస్తూ..సవాల్ విసురుతూ!
ఇక్కడి క్యాంపులో అభిమన్యు, క్రిష్ణ, జయంత్, వినాయక, దేవా, రంజన్‌లనే కుంకీ ఏనుగులు ఉన్నాయి. ఇటీవల సోమలలో రైతును ఏనుగులు చంపడంతో పలువురు రోడ్డెక్కారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అటవీశాఖ హుటాహుటిన టేకుమంద వద్ద కుంకీలతో ట్రయల్ రన్ చేశారు. అడవిలో ఏనుగుల మళ్లింపునకు పూర్తిఫిట్‌నెస్ కలిగిన క్రిష్ణ, జయంత్, వినాయక్‌ను మాత్రం మావటీల ద్వారా పంపారు. అడవిలోని ఏనుగుల గుంపును అక్కడి నుంచి కౌండిన్య ఫారెస్ట్‌లోకి మళ్లించారు. ఇలా అడవిలోని ఏనుగులను ఎన్ని సార్లు మళ్లించినా అవి అడవిని దాటి వస్తూనే ఉన్నాయి. రైతుల పంట పొలాలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. మదపుటేనుగులైతే గ్రామాలే కాదు ఇటీవల పలమనేరు పట్టణంలోకి ఓ మదపుటేనుగు వచ్చి హల్‌చల్ చేసింది. దీన్ని మళ్లించే క్రమంలో సుకుమార్ అనే ఎఫ్‌ఎస్వోపై దాడి చేసింది. తాజాగా మదపుటేనుగులు ఇక్కడి ఎలిఫెంట్ క్యాంపు వద్దకొచ్చి ఘీంకారాలు చేస్తూ కుంకీలకు సవాల్ విసిరాయి. ఇప్పుడు కుంకీలున్న చోటకే ఎక్కువగా మదపుటేనుగులు వచ్చి వాటిని బెదిరిస్తున్నాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా కుంకీలపై మదపుటేనుగులు దాడి చేసే అవకాశం లేకపోలేదు.


