‘ప్రైవేటీకరణ’పై 12న ర్యాలీ
తిరుపతి సిటీ: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా తిరుపతిలో ఈ నెల 12వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శనివారం ఈ మేరకు పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. భూమన మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే ప్రధాన ఉద్ధేశంతో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను జగనన్న తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కానీ, కూటమి ప్రభుత్వం కుట్రతో మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా చేపట్టనున్న ర్యాలీకి ల్లాలోని పార్టీ కార్యకర్త లు, నాయకులు, విద్యార్థులు పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ శిరీష, సత్యవేడు సమన్వయ కర్త నూకతోటి రాజేష్, జీడీ నెల్లూరు సమన్వయ కర్త కృపాలక్ష్మి, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రరెడ్డి పాల్గొన్నారు.


