
మార్కెట్‌లోకి న్యూ విక్టరీస్ కారు
తిరుపతి కల్చరల్ : మారుతీ సుజికీ సరికొత్త ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన న్యూ విక్టరీస్ కారును శుక్రవారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. రేణిగుంట రోడ్డులోని భార్గవి ఆటో మొబైల్స్ షోరూంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి కె.మురళీమోహన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ శ్రీనివాస కుమార్ హాజరై నూతన విక్టరీస్ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సరికొత్త కారు అత్యధిక సేప్టీతో అత్యాధునిక టెక్నాలజీతో చాలా బాగుందని తెలిపారు. మొదటి సారిగా భారత్ ఎన్‌సీఏపీ గ్లోబల్ ఎన్‌సీఏపీ, 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. భార్గవి ఆటో మొబైల్స్ చైర్మన్ బలరామిరెడ్డి మాట్లాడుతూ.. ఎంఐడీఎస్‌యూవీ రేంజ్ కారులో ఏడీఏఎస్ లెవల్–2 ప్రవేశపెట్టారని తెలిపారు. షోరూం ఎండీ కె.నిరంజన్ మాట్లాడుతూ.. ఈ కారు డైనామిక్ ఇన్ మోషన్ డిజైన్‌తో ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఇందులో 4 ఇంజన్ ఆప్షన్స్‌తో స్మార్ట్ లైబ్రడ్, స్ట్రాంగ్ బైబ్రో, 5 సీఎన్‌జీ ఆల్ గ్రిప్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.19,93,900 వరకు లభిస్తుందన్నారు. అంతేకాక ఈ కారు ఆకర్షణీయమైన పది రంగులలో అందుబాటులో ఉందని తెలిపారు. భార్గవి ఆటో మొబైల్స్ ఈడీ కొండా ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ కొత్త కారులో యువత మెచ్చే ఎంతో ఇష్టమైన మ్యూజిక్, డాల్బీ ఆటోమొడ్స్ హార్మన్ ఆలాంగ్ విత్ అండ్ స్పీకర్స్, సౌండ్ సిస్టమ్స్ సౌలభ్యం ఉందన్నారు. యువతను ఆకర్షించేలా 360 డిగ్రీ కెమెరా సదుపాయంతో పాటు అత్యధిక మైలేజీ వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భార్గవి సీజీఎం రమేష్ బాబు, డీజీఎం మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.