
శాస్త్రోక్తం..అంకురార్పణం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు గురువారం అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన చేశారు. ఉదయం ఆచార్య రిత్వికరణం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం జరిపారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
పవిత్రోత్సవాల్లో నేడు
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్రవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుంచి 6 గంటలకు గ్రామోత్సవం, 7 నుంచి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించి, పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.