
అధ్యాపకుల కొరత
శాశ్వత అధ్యాపకుల కొరత వర్సిటీని తీవ్రంగా వేధిస్తోంది. సుమారు 400 మందికి పైగా శాశ్వత అధ్యాపకులు అవసరం ఉండగా కేవలం 130మంది మాత్రమే ప్రస్తు తం ఉన్నారు. తాత్కాలిక అధ్యాపకులను సైతం ఇటీవల తొలగించడంతో నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమవుతున్నారు. భాషా ప్రాతిపదిక కోర్సులైన సంస్కృతం, తెలుగుపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో పాటు హిస్టరీ, పొలిటికల్ సైనం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, హోంసైన్స్ వంటి కోర్సులలో ఈ ఏడాది కనీసం 15శాతం సైతం అడ్మిషన్లు కూడా లేకపోవడం దారుణం.
ఎస్వీయూ పరిపాలనా భవనం