
ప్రాణం తీసిన గుంత
వరదయ్యపాళెం: మండలంలోని శ్రీకాళహస్తి–తడ మార్గంలో ఆర్ అండ్ బీ రహదారిపై పడిన గుంత నిండు ప్రాణాన్ని బలిగొంది. సత్యవేడు మండలం, జడేరి పంచాయతీ, కేవీకండ్రిగకు చెందిన ఎం.వెంకటేశులు (35) శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ తడలో నివాసముంటున్నారు. ఈ నెల 6న రాత్రి 10 గంటల సమయంలో వరదయ్యపాళెంలో తన స్నేహితుడిని కలుసుకుని తిరిగి తడలోని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలోని బత్తలవల్లం సమీపంలో ఇనమాలగుంట వద్ద ఆర్ అండ్ బీ రోడ్డుపై ఉన్న గుంతలో దిగి అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్ల దుస్థితి కారణంగా నిండు ప్రాణం గాల్లో కలిసింది. ఈ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ప్రాణం తీసిన గుంత