
24న చైన్నెలో కార్గో వస్తువుల వేలం
తిరుపతి అర్బన్ : చైన్నెలోని మాధవరం బస్టాండ్‌లో ఉన్న తిరుపతి కార్గో పాయింట్ వద్ద డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను ఈ నెల 24వ తేదీన వేలం వేయనున్నట్లు ఆర్‌టీసీ కార్గో ఇన్‌చార్జి నిర్మల తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు వేలం ఉంటుందని, పాట దక్కించుకున్నవారు వెంటనే మొత్తం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే వస్తువులను సైతం తక్షణమే తీసుకువెళ్లాల్సి ఉంటుందని వివరించారు.
పారా మెడికల్ కోర్సులకు ఫైనల్ కౌన్సెలింగ్ రేపు
తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో అలైడ్ హెల్త్ సైన్స్ ప్రొఫెషనల్ కౌన్సిల్ డిప్లొమా, పారామెడికల్ కోర్సుల్లో మిగులు సీట్లకు మంగళవారం తుది కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిప్లొమా, పారామెడికల్ కోర్స్‌లలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇప్పటికే ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు 9440879943 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
అంధకారంపై
విజయమే దీపావళి
తిరుపతి అర్బన్ : అంధకారంపై వెలుగు సాధించిన విజయమే దీపావళి పండుగని కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సంఘాల్ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ జిల్లావాసులందరూ సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని కోరారు.
ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ అడ్మిషన్లు ప్రారంభం
తిరుపతి రూరల్ : ఏపీ లాసెట్– పీజీఎల్‌సెట్–2025 అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల ప్రకారం ప్రక్రియను పూర్తిచేసి క్లాసులకు హాజరు కావలసిందిగా కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. 23న వెబ్ ఆప్షన్లు మార్పు, 25న సీటు అలాట్‌మెంట్, 27 నుంచి 29 వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశం ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు httpr://cetr.aprche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
రేపు తుమ్మలగుంటలో
నరకాసుర వధ
తిరుపతి రూరల్ : దీపావళి వేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం సోమవారం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద నరకాసుర వధ నిర్వహించనున్నారు. ఇందుకోసం రూ.2లక్షల వ్యయంతో 20 అడుగుల నరకాసుర ప్రతిమను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు నరకాసుర వధ కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు.

24న చైన్నెలో కార్గో వస్తువుల వేలం