
ఎస్వీయూలో మందుబాబులు పడ్డారు!
తిరుపతి సిటీ :ఎస్వీయూ ప్రాంగణంలో నిత్యం మందుబాబులు హల్ చల్ చేస్తున్నారు. గతంలో పలు మార్లు వర్సిటీ అధికారుల దృష్టికి విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు తీసుకెళ్లిన పట్టించుకోలేదు. దీనిపై క్షేత్రస్థాయి లో సాక్షి పర్యటించి సాక్ష్యాధారాలతో ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే వర్సిటీని జల్లెడపట్టి సుమారు రెండు ట్రాక్టర్ల ఖాళీ మద్యం సీసాలు రావడంతో నివ్వెరపోయారు.
పాత కథ పునరావృతం
ఎస్వీయూలో మళ్లీ మందుబాబులు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో ప్రతి చెట్టు కిందా మద్యం తాగే వారే కనిపిస్తున్నారు. మహిళా హాస్టళ్లకు సమీపంలో కూడా మద్యం తాగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అలాగే ఎస్వీయూ ప్రకాశం భవనంలో ఎదుట ఓపెన్ ఆడిటోరియంలోకి సైతం ఇష్టారాజ్యంగా ప్రవేశించి మద్యం సేవిస్తున్నారు. ఆడిటోరియంలో ప్రాంతంలో వందలాది ఖాళీ మద్యం సీసాలు పడిఉండడం గమనార్హం. అన్నపూర్ణ క్యాంటిన్ సమీపంలో కూడా మందు బాబుల హల్ చల్ చేస్తున్నప్పటికీ వర్సిటీ సెక్యూరీటీ, పోలీసులు పట్టించుకోవడం లేదదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు వర్సిటీ ప్రాంగణంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని కోరుతున్నారు.

ఎస్వీయూలో మందుబాబులు పడ్డారు!