మైండ్‌ ‘బ్లాంక్‌’! | - | Sakshi
Sakshi News home page

మైండ్‌ ‘బ్లాంక్‌’!

Oct 11 2025 6:10 AM | Updated on Oct 11 2025 6:10 AM

మైండ్‌ ‘బ్లాంక్‌’!

మైండ్‌ ‘బ్లాంక్‌’!

ఖాళీల జాబితాల్లో అవకతవకలు జరిగాయని నూతన టీచర్లు ఆరోపిస్తున్నారు. తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో టీచర్లను కేటాయించారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో టీచర్లనే నియమించలేదు. దీంతో ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది.

సీఎం సొంత నియోజకవర్గం అయిన కుప్పంలోనే అవకతవలు చోటు చేసుకున్నాయి. శాంతిపురం మండలం, శెట్టిబల్ల మోడల్‌ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులున్నారు. ఆ పాఠశాలలో పోస్టులు 4 ఉన్నాయి. ఈ పాఠశాలలో ఖాళీలే లేనట్లు వేకెన్సీ జాబితాలో చూపించారు.

శాంతిపురం మండలం శెట్టిపల్లి ప్రాథమిక మోడల్‌ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు 12 మందే ఉన్నారు. ఆ పాఠశాలలో శాంక్షన్‌ పోస్టు 1 ఉంది. అయితే ప్రస్తుత డీఎస్సీ పోస్టింగ్‌ ప్రక్రియ ఖాళీల జాబితాలో ఆ పాఠశాలలో 3 పోస్టులను నియమిస్తున్నట్లు చూపిస్తున్నారు.

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహాస్తి, తొట్టంబేడు మండలాల్లో ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో పోస్టుల ఖాళీలను చూపించలేదు.

సబ్జెక్టు టీచర్లు అవసరం ఉన్నప్పటికీ హెచ్‌ఆర్‌ఏ ప్రాంతాల్లో పోస్టులు ఉన్నా చూపించకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

తొట్టంబేడులో 1, శ్రీకాళహాస్తిలో 2 ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఖాళీలు ఉన్నప్పటికీ చూపించకుండా బ్లాక్‌ చేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 500 పోస్టులకుపైగా బ్లాక్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కౌన్సెలింగ్‌ నష్టపోయామంటున్న నూతన అయ్యోర్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన డీఎస్సీ నూతన టీచర్లకు కూటమి ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పోస్టింగ్‌ల కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తోంది. తమకు నచ్చిన విధంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టింది. పోస్టింగ్‌ల కౌన్సెలింగ్‌లో నిబంధనలను అమలు చేయకుండా సూచించిన చోటే కోరుకోవాలని నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. ఏకంగా 500 పోస్టులకు పైగా బ్లాక్‌ చేయడం దుమారం రేపుతోంది.

ఎప్పుడూ ఇలా లేదు

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హెచ్‌ఆర్‌ఏ పేరుతో (కేటగిరీ 1, 2) పోస్టులను 500కు పైగా బ్లాక్‌ చేశారు. కొత్త టీచర్లకు హెచ్‌ఆర్‌ఏ పోస్టులు ఇవ్వకూడదనే నిబంధన ఎక్కడా లేదు. ఇలా బ్లాక్‌ చేసిన పోస్టులన్నీ ప్రధాన ప్రాంతాల్లో ఉండడంతో వాటిని డిప్యూటేషన్స్‌ (ప్రభుత్వ ఆర్డర్‌) పేరుతో దోచుకునేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో డీఎస్సీ పోస్టింగ్‌లు ఇచ్చే సమయంలో పోస్టులను బ్లాక్‌ చేసిన సందర్భాలు లేవని యూనియన్‌ నాయకులు వాదిస్తున్నారు.

లోగుట్టుగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ

తిరుపతి జిల్లా కేంద్రంలో ఎస్జీటీలకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ ప్రక్రియ లోగుట్టుగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. కౌన్సెలింగ్‌ నిర్వహించకముందే నూతన టీచర్లకు ముందస్తుగా ఖాళీలను చూపించాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా మోసం చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తారని ఉపాధ్యాయ సంఘ నాయకులను లోనికి అనుమంతించ లేదు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను అర్ధరాత్రిలో ప్రారంభించి వేకువ జాము వరకు నిర్వహించారు. ఒకే ప్రాంతంలో నూతన టీచర్లందరికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా, అలా చేయకుండా కొందరికి ఒక కేంద్రంలో, మరికొందరికీ మరొక కేంద్రంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా కేంద్రంలో విశ్వం పాఠశాల శిక్షణా కేంద్రంలో ఈ నెల 9న ఉదయం 4.30 గంటల వరకు 1 నుంచి 250 వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 10న మెడ్జీ స్కూల్‌లో వరుస సంఖ్య 250 కు పైన ఉన్న వారిని ఉదయం 7 గంటలకు కౌన్సెలింగ్‌కు పిలిపించి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిరీక్షింపజేశారు. ఆ తర్వాత కౌన్సెలింగ్‌ ప్రక్రియను మొదలుపెట్టారు.

దివ్యాంగ ఉపాధ్యాయులకు అన్యాయం

డీఎస్సీలో ఎంపికై న దివ్యాంగ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియలో అన్యాయం చేశారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో వారికున్న రిజర్వేషన్‌, రోస్టర్‌ల ప్రకారం ముందస్తుగా పిలువాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా చివర్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి దివ్యాంగ టీచర్లకు అన్యాయం చేశారు.

అవకతవకలు ఇలా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement